Home జాతీయ వార్తలు 18 కాదు…16

18 కాదు…16

parlimentబాల నేరస్థుల వయసు తగ్గిస్తూ జువెనైల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
నిర్భయ తరహా బాలనేరస్థుల కట్టడికే : మంత్రి మేనకా గాంధీ
సెలక్ట్ కమిటీకి పంపకపోవడాన్ని నిరసిస్తూ వామపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ : బాలల న్యాయ చట్టం, సవరణ (జువెనైల్ జస్టిస్) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. తీవ్రమైన నేరాల విషయంలో 16 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిని వయోజను లుగా పరిగణించి విచారణ చేపట్టాలన్న బిల్లుకు మంగళవారం రాత్రి ఎగువసభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమో దించింది. మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ను రాష్ట్రపతికి పంపించనున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశాక చట్ట రూపం దాల్చనుంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం అనం తరం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్ని పక్షాలకు కృతజ్ఞతలు తెలి పారు. మరోవైపు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిం చాలని వామపక్షాలు చేసిన విజ్ఞప్తిని చైర్మన్ తోసిపుచ్చడంతో వామపక్షాలు సభనుంచి వాకౌ ట్ చేశాయి.ఎన్‌సిపి, డిఎంకె సహా పలు రాజ కీయ పార్టీలు కూడాఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. బాల నేరస్తుల వయసు స్థాయిని 16కు తగ్గించి అలాంటి నేరా లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని ప్రభుత్వాన్ని కోరాయి. అంతకుముందు మంత్రి మేనకాగాంధీ బాలల న్యాయ చట్టం, సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ చర్చను ప్రారంభించారు. 2012లో నిర్భయ సామూహిక అత్యాచారం-హత్య కేసు నేపథ్యం లో బాలనేరస్తుల వయసును 18నుంచి 16కు తగ్గించాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి ఊపం దుకున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లు ఆమోదంపై దృష్టి సారించింద న్నారు. నిర్భయ తరహా ఘోర నేరం మరే ఇతర బాలురు కూడా చేయకుండా చట్ట సవరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.ఈ చట్టం స్వభావరీత్యా కారుణ్య పరమైనది, సమగ్రమైనది అని అన్నారు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ బిల్లు యుపిఎ ప్రభుత్వానిదే కానీ ఎన్‌డిఎ ప్రభుత్వా నిది కాదని స్పష్టం చేశారు. నిర్భయ కేసులో బాలుడైన దోషి విషయంలో మనం ఏమీ చేయ లేకపోవచ్చు కానీ, అలాంటి అనేకమంది బాలు రు ఇటువంటి దారుణ నేరానికి పాల్పడ కుండా కట్టడి చేయవచ్చన్నారు. మేనకా గాంధీ ఈ సవ రణ బిల్లును వివరిస్తూ జస్టిస్ బోర్డ్‌లో నిపు ణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటా రని, వారు ఈ నేరం జరగడం వెనక వారి ఉద్దేశాన్ని అంచనావేస్తారని తెలిపారు. బాల నేరస్తుడు చిన్నపిల్లవాడి మన స్తత్వంతో వ్యవహ రించాడా లేదా పరిణతి చెందిన పెద్ద వయసు ఆలోచనలో ఈ నేరానికి పాల్ప డ్డాడా అనేది వారు మొదట తేలుస్తారని చెప్పారు. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య మాట్లా డుతూ ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లును మూడు సార్లు జాబితాలో చేర్చిందన్నారు. గత సమావేశాల్లో అనేకసార్లు జాబితాలో చేర్చా మన్నారు. జువెనైల్ జస్టిస్ బిల్లు ను తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వమేమీ సిగ్గు పడటం లేదన్నారు. అనవసర చర్చలు జరగ డం బాధా కరమన్నారు. ప్రతిపక్షనేత ఆజాద్, వెంకయ్యపై విరుచుకు పడ్డారు. సభ సజావు గానే సాగుతున్నా తప్పు పట్టడమేంటన్నారు.
నేనైతే కాల్చేసే వాడిని 
బాలల బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ఉద్వేగపూ రిత ప్రసంగం చేశారు. నా కూతురిపై ఎవరైనా దాడిచేస్తే వాళ్లను తుపాకీతో కాల్చివేస్తానని అన్నారు. ఈ బిల్లుకు తాను సంపూర్ణంగా మద్ద తు ఇస్తున్నానన్నారు. సమాజ్‌వాదీ పార్టీ సభ్యు డు రవి ప్రకాష్ వర్మ మాట్లాడుతూ ఉపశ మన చర్యలు పక్కనపెట్టి ప్రభుత్వం నిర్భ య లాంటి అమానుషాలను నియంత్రించే కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
స్వాగతించిన నిర్భయ కుటుంబం
జువెనైల్ బిల్లును నిర్భయ తల్లిదండ్రులు స్వాగ తించారు. బిల్లుపై చర్చను రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని పరిశీలించిన వారు బిల్లు ఆమోదం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తమ కూతురుకు న్యాయం జరగకపోయినా భవి ష్యత్తులో ఈ తరహా నేరాలు చోటుచేసుకోకుం డా చేసేందుకు ఉపయోగపడగలదన్నారు