Home తాజా వార్తలు మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం

మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం

deepa-Malikరియో డి జనీరో : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్ విభాగంలో దీపా మాలిక్ రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో 4.61 మీటర్ల దూరం విసరడం ద్వారా అమె ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఘనతతో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా దీపా రికార్డు సృష్టించింది. బహ్రెన్‌కు చెందిన ఫతేమా నేథమ్ 4.76 మీటర్లు విసిరి స్వర్ణం సాధించగా గ్రీస్‌కు చెందిన దిమితా 4.28 మీటర్లతో కాంస్యం గెలిచింది.