Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

దీపక్ చౌదరి దీక్ష భగ్నం

Strike-breake

ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 34,35,36,37,48 డివిజన్ల నిర్వాసితులకు 2014 సంవత్సరంలో కోట్ల రూపాయలు వెచ్చించి మామిళ్లగూడెం నుంచి సారధినగర్‌కు వెళ్లే రైల్వే అండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన అఫ్రోచ్ రోడ్డు పూర్తికా కపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఆయా పనులను చేపట్టాలని కోరుతూ 36వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట గల ధర్నాచౌక్‌లో ఒక్క రోజు నిరాహారదీక్షకు పిలుపునిచ్చారు. ఈపిలుపులో భాగంగా తొలుత నగరంలోని 36వ డివిజన్
మామిళ్లగూడెం నుంచి కాంగ్రెస్ నాయకులు, పార్టీశ్రేణుల ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వైరా రోడ్డు మీదుగా కలెక్టరేట్ కు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

ఈ సందర్బంగా ఆందోళనకారులకు, పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో పాటు తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఆందో ళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్బంగా డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తాము నిరసన జరిపే హక్కు ఉన్నప్పటికీ అధికార పార్టీ టిఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు.

ఈవిధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అనంతరం కార్పొరేటర్ దీపక్ చౌదరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను తెలియజేయడమే తమ హక్కన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు యర్రం బాలగంగాధర్‌తిలక్, వడ్డెబోయిన నరసింహారావు, ఫజల్, మణికంఠ, ఝాన్సీ పాల్గొన్నారు.

Comments

comments