Home తాజా వార్తలు సౌతాఫ్రికా అందాల పోటీలో మెరిసిన తెలంగాణ తార…

సౌతాఫ్రికా అందాల పోటీలో మెరిసిన తెలంగాణ తార…

Deepika jonnalagadda wins beauty contest at south africa

జోహన్నస్‌బర్గ్: తెలంగాణకు చెందిన దీపికా జొన్నలగడ్డ సౌతాఫ్రికా అందాల పోటీల్లో పాల్గొంది. గ్లో టివి నిర్వహించిన మిస్ ఇండియా సౌతాఫ్రికా పోటీల్లో దీపికా రెండవ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 1200 మంది ఈ అందాల భామలు పాల్గొన్నారు. కాగా, ఆ పోటీల్లో ఫైనలిస్టుగా దీపికా ఎంపిక కావడం గర్వకారణం. సౌతాఫ్రికాలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఏకైన తెలంగాణ అమ్మాయిగా రికార్డు క్రియేట్ చేసింది. నాగోల్‌కు చెందిన దీపిక లండన్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించింది. పెళ్లి అయిన లేదా విడాకులు తీసుకున్న భారతీయ మహిళలు మాత్రం ఈ అందాల పోటీలో పాల్గొంటారు. చిన్నతనం నుంచే దీపిక ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇలాంటి అందాల పోటీ ద్వారా మహిళలు తమ సాధికారతను చాటుకునే అవకాశం ఉంటుందని దీపిక జొన్నలగడ్డ పేర్కొంది.