Home తాజా వార్తలు అందుకే రణబీర్ కి బ్రేకప్ చెప్పా: దీపికా

అందుకే రణబీర్ కి బ్రేకప్ చెప్పా: దీపికా

Deepika Padukone comments on Relationship with Ranbir Kapoor

ముంబయి: బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె, యంగ్ హీరో రణవీర్ సింగ్‌‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నరని చాలా కాలంగా ఓ వార్త తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ జంట ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్తున్నారు. ఇదిలాఉండగా దీపికా గతంలో రణబీర్ కపూర్‌తో కూడా ప్రేమాయణం నడిపిన విషయం విదితమే. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు రణబీర్‌ మోసం చేశాడంటూ దీపికా సడెన్ గా బ్రేకప్ చెప్పి సంచలనం రేపింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు దీపికా డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయిందట. అయితే, ఆ బ్రేకప్‌‌కి అప్పుడు సరైన కారణం చెప్పని దీపికా తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రణబీర్ తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

అయినా అతనికి నేను మరో అవకాశం ఇచ్చాను. కానీ, అది ఎంత తెలివి తక్కువ నిర్ణయమో నాకు తర్వాత తెలిసొచ్చింది. మళ్లీ అదే తప్పు చేశాడు. అందుకే బ్రేకప్ చెప్పేశాను. బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా రోజులు ఏడ్చానని దీపికా తెలిపింది.  రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నేను నిజాయతీగా ఉన్నాను. ఎప్పుడూ మోసం చేయలేదు. ఒకరితో లవ్ లో ఉండి, మరోకరితో రిలేషన్‌షిప్‌ మెయింటెన్ చేయలేదని చెప్పుకొచ్చింది. కానీ, రణబీర్ కపూర్ నన్ను మోసం చేశాడంటూ వాపోయింది. అందుకే అతన్ని క్షమించలేకపోయనని దీపిక చెప్పింది. ఇక బాలీవుడ్ లో ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్… దీపికా తరువాత కత్రినా కైఫ్ తో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లిపీటల వరకు వచ్చి వీళ్ల రిలేషన్ మధ్యలోనే మటాష్ అయింది. ప్రస్తుతం అలియా భట్ తో  రణబీర్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ జంట కూడా పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.