Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నం.1 స్థానంపై నమ్మకం లేదు

Deepika-padukone

దీపికా పదుకునే ప్రస్తుతం బాలీవుడ్‌లో నం.1 స్థానంలో ఉందనే చెప్పుకోవాలి. ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ, సోనాక్షిసిన్హా తదితరులు గట్టిపోటీనిస్తున్నప్పటికీ దీపికకు దొరికినన్ని అవకాశాలు మరొకరికి దొరకడం లేదు. బాలీవుడ్‌లో విజయఢంకా మోగించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తాచాటే ప్రయత్నంలో ఉంది.

కానీ జయాపజయాలు రెండింటినీ తాను సమానంగా స్వీకరిస్తానని అంటోంది ఈ బ్యూటీ. “నం.1 స్థానంపై నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ స్థానం తర్వాత పైకి వెళ్లడానికి మరో అంకె లేదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, సాధించాలి. కానీ ఇలాంటి స్థితిలో చాలామంది మనచుట్టూ తిరుగుతుంటారు.

ఎవర్ని నమ్మాలో అర్థం కాదు. అందరూ సన్నిహితంగా ఉన్నట్టు కనిపించినా ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది. ఈర్ష, అసూయలతో చాలామంది దూరమైపోతారు. నా అదృష్టం ఏమిటంటే చిన్నప్పటి నా ఫ్రెండ్స్ కొంతమంది నా వెంటే ఉన్నారు. వాళ్లవల్లే నేను విజయాల తాలూకు ఒంటరితనాన్ని దాటేస్తున్నాను”అని అంటోంది బ్యూటీ దీపిక.

Comments

comments