Home వార్తలు వచ్చేవారమే దీపిక హాలీవుడ్ జర్నీ

వచ్చేవారమే దీపిక హాలీవుడ్ జర్నీ

deepikaబ్యూటీ దీపికా పదుకునే ఇప్పుడు బాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోయిన్. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌ల నుంచి గట్టి పోటీ ఉన్నా హిట్స్, క్రేజ్‌లో చూస్తే దీపికను నెం.1 హీరోయిన్ అనాల్సిందే. ఇన్నేళ్లు బాలీవుడ్‌ను మైమరపించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ పట్టాలు ఎక్కేస్తోంది. మరో వారంలో ఆమె తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో కలిసి దిగిన ఫొటోను కొంతకాలం క్రితం రిలీజ్‌చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దీపిక తర్వాత అసలు విషయాన్ని మెల్లిగా వెల్లడించింది. ‘xxx’ మూవీలో తను నటించబోతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారి కంగా ప్రకటించేవరకు దీపిక ఈ సీక్రెట్‌ను చెప్పకుండా ఎదురుచూసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభించు కోవడానికి టైం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్  సంపా దించిన సిరీస్ అయిన ‘xxx’ మూవీలో దీపిక నటించేందుకు ముహూర్తం సెట్ అయింది. వచ్చే వారమే దీపికాపదుకునే హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కనుంది. “హాలీవుడ్ ఎంట్రీపై నాకు ఎంతో ఉత్సాహంగానూ… టెన్షన్‌గానూ ఉంది. వచ్చేవారమే నా తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నా”అని దీపిక చెప్పింది. మొదట డొమినికన్ రిపబ్లిక్‌లో ‘xxx’ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది.