Home జాతీయ వార్తలు అప‘కీర్తి’

అప‘కీర్తి’

జైట్లీపై ఆరోపణలు, పార్టీ నుంచి ఎంపి కీర్తి ఆజాద్
సస్పెన్షన్ నేపథ్యంలో బిజెపి సీనియర్‌ల భేటీ

మోడీజీ, నా తప్పేమిటో చెప్పండి, కలుగజేసుకోండి : ఆజాద్
అవినీతిని ప్రశ్నించినందుకు ఆజాద్‌పై సస్పెన్షనా?
ప్రధాని మౌనం వీడాలి : రాహుల్
కీర్తి ఆజాద్‌కు సుబ్రహ్మణ్య స్వామి మద్దతు

Untitled-1న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ, పార్టీకి చెందిన ఇత ర నేతలు కొందరు గురువారం సమావేశం అయ్యారు. పార్టీలో ఇటీవలి పరిణామాలను సమీక్షించారు. ఎంపి కీర్తి ఆజాద్ సస్పెన్షన్ , పార్టీ నాయ కత్వానికి సంబంధించిన ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయంపై అధినాయకత్వంపై దాదా పుగా తిరుగుబాటుకు దిగిన వారు భేటీ నిర్వహించడం కీలకంగా మారిం ది. అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషీ, శాంతాకుమార్, యశ్వంత్ సిన్హాలు సమావేశం జరిపారు. బీహార్ ఎన్నికల తరువాత వారు పార్టీ నాయ కత్వ వైఖరిని ప్రశ్నించి, పరాజయానికి ప్రధాని కానీ పార్టీ అధ్యక్షులు కానీ బాధ్యత వహించాలని వారు ఓ బహిరంగ ప్రకటన వెలువరించారు. పార్టీ నాయకత్వానికి పలు సవాళ్లు విసిరారు. అయితే ఇప్పుడు గురువారం జరి గిన భేటీ తరువాత ఎలాంటి తక్షణ ప్రకటన వెలువడలేదు. అయితే వారు అనువైన సమయం చూసుకుని ప్రస్తుత అంశాలపై సరైన వేదిక నుంచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. డిడిసి ఏ వ్యవహారంలో జైట్లీ పాత్ర గురించి పార్లమెంట్‌లోనూ వెలుపల కూడా సొంత పార్టీ ఎంపి కీర్తి ఆజాద్ విమర్శలకు దిగడంతో పార్టీ అధినాయక త్వం తీవ్రంగా స్పందించింది. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంది. కీర్తి ఆజాద్ అంశం ప్రస్తావనకు వచ్చిందా? అని నేటి భేటికి హాజరు అయిన ప్రముఖులలో ఒకరిని విలేకరులు అడిగారు. సమావేశం నేపథ్యం బట్టి చూ స్తే , ప్రస్తావనకు వీలుంటుంది కదా అని సమాధానం ఇచ్చారు. అయితే వివరాలను వెల్లడించడానికి ఆ సీనియర్ నేత తిరస్కరించారు. అద్వానీ, శాంతకుమార్, సిన్హా నేరుగా జోషీ నివాసానికి వెళ్లారు . గంట సేపు రహస్య చర్చలు జరిపారు. సమావేశం తరువాత బయటకు వచ్చిన శాంతకుమార్ ను విలేకరులు చుట్టుముట్టారు. ఏమి జరిగిందనే ప్రశ్నకు ఆయన నవ్వుతూ మేం కలిశాం, టీ తాగాం అంటూ సస్పెన్స్ మిగిల్చారు. తన సస్పెన్షన్ గురించి ఆజాద్ బిజెపి పెద్దల జోక్యం కోరుకుంటున్నారు. పార్టీకి చెందిన మార్గదర్శక్ మండల్ స్పందించాల్సి ఉందని కోరారు. ఈ మండలిలో అద్వా నీ, జోషీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న తరువాత అమిత్ షా ఈ గౌరవప్రద కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ మండలి ఒక్కసారి కూడా భేటీ కాలేదు.
కీర్తి ఆజాద్‌కు సుబ్రమణ్యస్వామి మద్దతు
అరుణ్‌జైట్లీ అవినీతిపై ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి కీర్తిఆజాద్‌పై సస్పె న్షన్ వేటు వేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందిం చారు. సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ కీర్తి ఆజాద్ తప్పేమున్నదని అధి ష్టానాన్ని నిలదీశారు. ఆజాద్ కేవలం ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అవినీతి గురించే మాట్లాడారని, ఆ అంశంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది ఏమీ లేదన్నారు. ఆజాద్‌ను ఎందుకు సస్పెండ్ చేశారంటూ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియే షన్‌లో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు సహా కీర్తిఆజాద్ కూడా బాహాటంగా ఆరోపణలు చేశారు. ఇదిలాఉంటే ఆజాద్ సస్పెన్షన్ వేటుపై బిజెపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పార్టీ సీనియర్‌నేత మురళీ మనోహర్ జోషీ నివాసంలో ఎల్‌కె.అద్వానీ సహా పలువురు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు.