Home ఖమ్మం కూటమికి ఓటమి తప్పదు: పాయం వెంకటేశ్వర్లు

కూటమికి ఓటమి తప్పదు: పాయం వెంకటేశ్వర్లు

Defeat in Telangana state

బూర్గంపాడు: తెలంగాణ రాష్ట్రంలో కూటమికి ఓటమి తప్పదని,మళ్ళీ రాష్ట్రంలో గులాబి జెండా ఎగురటం తధ్యమని పినపాక నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ మాజీ,తాజా ఎంఎల్‌ఎ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని సారపాక గ్రామంలోని బూర్గంపాడులో టిఆర్‌ఎస్ నాయకులు గోనెల నాని ఆధ్వర్యంలో 250మంది కుటుంబాలను టిఆర్‌ఎస్ పార్టీలోకి పాయం వెంకటేశ్వర్లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి యువత అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఫలాలను రెండితలుగా ప్రజలకు అందిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేసి పెట్టుబడి సాయం అందిస్తున్నామని,త్వరలో రెండో విడత పంట సాయం కూడ రైతులకు అందుతుందని తెలిపారు.

డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టి నిరుపేదలకు అందిస్తున్నామని అన్నారు. మరో సారి అవకాశం ఇస్తే తప్పకుండా సారపాక అభివృద్ధికి పూర్తి స్థాయిలో పని చేస్తానని తెలిపారు. రైతుకు ప్రమాదభీమా కల్పించి ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 5లక్షలను అందిస్తున్నామని పేర్కొన్నారు. దాదాపుగా రాష్ట్రంలో అనేక మంది మరణించిన రైతులకు డబ్బులు సైతం వారి నామిని ఖాతాల్లో జమచేయడం జరిగిందని, ప్రజలు టిఆర్‌ఎస్ పాలన మళ్ళీ రాష్ట్రంలో రావాలని కోరుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలైనా ఎస్‌సి,ఎస్‌టి,మైనార్టీ,అన్ని వర్గ ప్రజల బిడ్డల వివాహానికి కాళ్యాణలక్ష్మీ,శాదీముబారక్‌ల ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నామని ప్రజలకు ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మిత్రాపక్షాలు ఎన్ని మాటలు చెప్పిన వినటానికి ప్రజలు ఇష్ట పడటంలేదని,టిఆర్‌ఎస్ వైపు అన్ని వర్గల ప్రజలు అడుగులు వెస్తున్నారని అన్నారు.

ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇంటింటికి మంచినీటి పథకం,మిషన్ కాకతీయ,మిషరన్ భగీరథ కార్యక్రమాల ద్వార రైతుల పంటలకు,ఇంటికి నీటిని అందించే బృహత్తర కార్యక్రమాని ప్రారంభించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వందే అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కోసం కెసిఆర్ ఆహార్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ పార్టీ ఎదుగుదతలకు కృషి చేస్తున్న యువ నాయకులు గోనెల నాని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కైపు రోశిరెడ్డి,జెడ్‌పీటీసీ బట్టా విజయ్‌గాంధీ,మార్కెట్ యార్డ్ ఛెర్మన్ సురపాక విజయనిర్మల,జిల్లా రైతు సమస్వయ కమిటి సభ్యులు రాధకృష్ణ,సత్యం తదితరులు పాల్గొన్నారు.

Defeat in Telangana state.