Home జాతీయ వార్తలు ఓటమి ఓర్వలేక  కాంగ్రెస్ ధ్వంస ధోరణి : మోడీ

ఓటమి ఓర్వలేక  కాంగ్రెస్ ధ్వంస ధోరణి : మోడీ

pmకొల్లాం : లోక్‌సభ ఎన్నిక లలో చవిచూసిన ఘోర మైన ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకో లేకపోతోందని అందుకే చేసేది లేక ఇప్పుడు దేశాన్ని ధ్వంసం చేసే ఏకైక కార్యక్రమం పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర పదజాలంతో మండి పడ్డారు. పార్లమెంట్ సభా కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకుంటున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. కేరళలో శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డిపి) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కార్యక్రమంలో ప్రధాని మంగళవారం ప్రసంగించారు. కాంగ్రెస్ వైఖ రి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటమితో నిరాశకు గురయిన పార్టీ ఇప్పుడు ధ్వంసరచన ధోరణితో వ్యవహరిస్తోందని, సభలను అడ్డుకోవడం ఇందులో భాగమే అని విమర్శించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చర్చ, సమ్మతి, నిర్ణయం అనే 3డి నినాదాన్ని ప్రవచిస్తే కాంగ్రెస్ వారు దానిని గాలి కొదిలేసి ఆటంకం (డిస్రప్ట్), విధ్వంసం (డిస్ట్రక్ట్), నిర్మూలన (డిమాలిష్) అనే 3 డి ఎఫెక్ట్‌తో పనిచేస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఎస్ టి బిల్లుపై విభేదాలు వీడి పనిచేద్దామని, సహకరించాలని పక్షం రోజుల క్రి తం ప్రతిపక్షాలకు తాను విజ్ఞప్తి చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘ప్రజల చేతిలో ఓడిపోయి, ఇళ్లకు పంపించబడ్డ వారంతా ఇప్పుడు నాశనం అయ్యాం. ఇతరులను ధ్వంసం చేస్తాం అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు’ అ ని మోడీ వ్యాఖ్యానించారు. దేశానికి ఏదైనా జరగనివ్వండి, తమ పంతం కొ ద్దీ పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజ్యసభలో జరుగుతు న్న పరిణామాలను తాను ప్రస్తావిస్తున్నానని, అక్కడ ఎవరు ఎలా వ్యవహరి స్తున్నారనేది అందరికీ తెలుసునని నిరసన వ్యక్తం చేశారు. కేరళలో వెలిసిన ఎస్‌ఎన్‌డిపి వెనుకబడ్డ ఎజావా కులాల అనుబంధ సంస్థ. వచ్చే ఏడాది జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఈ కులం ఓట్లను బిజెపి ఆశిస్తోంది. కేంద్ర ప్రభు త్వ విధానాలు రాష్ట్రపతి చెప్పిన 3డి అంశాలకు అనుగుణంగా ఉంటుందని , అయితే ప్రతిపక్షం ఎంచుకుంటున్నది దానికి విరుద్ధమైన ప్రతికూల 3డి నినాదాన్ని అని చురకలు పెట్టారు.