Search
Friday 21 September 2018
  • :
  • :

భారత్‌ను ఓడించడం తేలిక కాదు

Steve-Smith

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించడం ఇతర జట్లకు అంత సులువుకాదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టివ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉందన్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై చెలరేగే సత్తా భారత ఫాస్ట్ బౌలర్లకు ఉందని వివరించాడు. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్ కుమార్ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగ్గా రాణించడం ఖాయమన్నాడు. ఒత్తిడిలోనూ నిలకడగా బౌలింగ్ చేసే సత్తా భువనేశ్వర్‌కు ఉందన్నాడు. ఐపిఎల్‌లో పలు మ్యాచుల్లో అతను సన్‌రైజర్స్‌ను ఆదుకున్న విషయాన్ని స్మిత్ గుర్తు చేశాడు. అంతేగాక, బుమ్రా వంటి ప్రతిభావంతుడైన భారత్‌కు అందుబాటులో ఉన్నాడన్నాడు. డెత్ ఓవర్లలో చక్కగా రాణించే సత్తా బుమ్రా, భువనేశ్వర్‌లకు ఉందని, ఇది టీమిండియాకు ఎంతో కలిసి వచ్చే అంశమన్నాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో తాము మెరుగైన ఆటను కనబరచడం ఖాయమని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం తమ ఆటగాళ్లకు కలిసి వస్తుందన్నాడు. వార్నర్, ఫించ్, క్రిస్ లిన్, ఆడమ్ జంపా, హెన్రిక్స్‌లు ఐపిఎల్ పదో సీజన్‌లో సత్తా చాటారని, దీంతో వారు ఆత్మవిశ్వాసంతో ఈ టోరీకి సిద్ధమయ్యారన్నాడు. సమష్టి పోరాటంతో ముందుకు సాగడమే తమ లక్షమని వివరించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. నిలకడగా రాణిస్తే విజేతగా నిలువడం తమకు కష్టమేమి కాదని స్మిత్ అన్నాడు.

Comments

comments