ఢిల్లీ: లోక్సభలో గురువారం టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. బైసన్ పోలో, జింఖానా మైదానాలను రాష్ట్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకటో నంబరు రాష్ట్ర రహదారి అభివృద్ధికి రక్షణశాఖ భూములివ్వాలని ఆందోళన చేపట్టారు. 44వ నంబరు జాతీయరహదారికి రక్షణ శాఖ భూములివ్వాలని ఎంపిలు డిమాండ్ చేశారు. వీటిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందించలేదని ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆయన రాజ్యసభలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపుతుందని ప్రశ్నించారు. ఇటీవల కర్నాటక ప్రతిపాదనలను వెంటనే ఆమోదం తెలిపారన్నారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామ్ ఎపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ పట్ల ఆమె వివక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని దుయ్యబట్టారు.