Home జాతీయ వార్తలు జైట్లీపై అవన్నీ పుకార్లే: కేంద్రం

జైట్లీపై అవన్నీ పుకార్లే: కేంద్రం

Arun Jaitley health Condition

 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తల్ని ప్రభుత్వం ఆదివారం ఖండించింది. అవి నిరాధారమైనవి, వాటిల్లో నిజం లేదని తెలిపింది. పుకార్లను ఖండించి మీడియా స్పష్టత ఇవ్వాలన్నది. జైట్లీ ఆరోగ్యంపై ప్రభుత్వ ప్రతినిధి సీతాంశు కార్ ట్విటర్‌లో స్పష్టతనిచ్చారు. ‘కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై మీడియాలో ఒక వర్గం పేర్కొంటున్న సమాచారం అబద్ధం . ఆ వార్తలకు ఆధారం లేదు’ అని వివరణ ఇచ్చింది. అరుణ్‌జైట్లీని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అందుబాటులో లేరు. ఆర్థికమంత్రి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.

అనారోగ్యం వల్ల మోడీ కేబినెట్‌లో జైట్లీ ఉండకపోవచ్చని, చికిత్సకోసం బహుశ బ్రిటన్ కాని, అమెరికా కానీ వెళ్లవచ్చని శుక్రవారంనాడు ఆయన ఆరోగ్యంపై కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అంతుచిక్కని అనారోగ్యం వల్ల జైట్లీని వైద్యపరీక్షలు, చికిత్స కోసం గతవారం ఎయిమ్స్‌లో చేర్పించారు. గురువారం ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు జైట్లీ హాజరు కాలేదు. గత మూడు వారాలుగా ఆయన ఆఫీస్‌కు రావడం లేదు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా జైట్లీ హాజరు కాలేదు.

Defense Representative Tweet on Arun Jaitley health Condition