Home రాష్ట్ర వార్తలు ముమ్మాటికీ హత్యే

ముమ్మాటికీ హత్యే

దేవిరెడ్డి మృతిపై విచారణకు యువజన, మహిళా సమాఖ్యల డిమాండ్

deviపంజాగుట్ట: హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో  ఆదివారం నాడు కారు ప్రమాదంలో మృతి చెందిన దేవిరెడ్డి(21) మర ణంపై పలు అనుమానాలు ఉన్నాయని ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తుందని,  ఈ ఘటన ప్రమాదం కాదని ముమ్మాటికీ హత్యేనని మృతురాలి తండ్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల వ్యవహరిస్తున్న నిర్లక్షాన్ని నిరసిస్తూ  మృతురాలి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కెబిఆర్ పార్కు వద్ద బుధవారం  సాయంత్రం క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా తమకు న్యాయం చేయాలంటు వారు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ హత్య మిస్టరీలో ఉన్న నిజ నిజాలను పోలీసులు వెలికితీసేందుకు సత్వర న్యాయ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు నిమిషాలలో ఇంటికి వస్తానన్న తమ కుతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిందంటు పోలీసులు తెలిపిన వార్తతో హఠత్ పరిణామానికి లోనయ్యామని అన్నారు. తమ కుతురు పోగొట్టుకొన్న మనో వేదనతో ఉన్న తమకు పోలీసులు విచారణలో చేస్తున్న జాప్యం తమను మరింత కలచి వేస్తుందని అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి సమీపంలో ఉన్న తమకు ఫోన్ చేయని పోలీసులు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కుటుంబ సభ్యులకు ముందు సమాచారం అందించడంలో మతలబేమిటని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షి నరేందర్ రెడ్డి ఇచ్చిన వివరణ స్పష్టంగా ఉన్నప్పటికీ పోలీసులు పొంతన లేని సమాదానాలు ఇస్తు కేసులోని నిజాలను మరుగుపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క రోజులో తెలాల్సిన విచారణను కావాలనే మూడు రోజులు గడుస్తున్న ఇంతవరకు ఎటువంటి పురోగతి లేకుండా చేస్తున్నారని అన్నారు. కారు ఢీకొట్టిన చెట్టు వద్ద ఆధారాలు కారు ఢీకొట్టినట్టుగా చెబుతు గాజు పెంకులు చల్లి, చెట్టును చెక్కి ప్రమాదమనే భ్రమను పోలీసులు కల్గిస్తున్నారని అన్నారు.  ఈ హత్య మిస్టరీని చేదించాలంటే ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించడంతో పాటు, దేవి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించేలా వ్యవహరిచాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ కూతురు మరణ విషయంలో జూబ్లిహిల్స్ పోలీసులు కొందరికి అనుకులంగా వ్యవహరిస్తున్నారని, తమకు సత్వర న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి , మానసరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.