Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఐదవ తరగతి ప్రవేశ పరీక్షలో డిగ్రీస్థాయి ప్రశ్నలు!

పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులెందుకో?

examsమన తెలంగాణ/జహీరాబాద్ : తెలంగాణక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రం, కేంద్రం వద్ద పోలీసుల మొహరింపు లాంటి సంఘటనలు చిన్నారి విద్యార్థులను భయాందోళ నకు గురిచేసాయని చెప్పవచ్చు.
4వ తరగతిలో ఉత్తీర్ణులైన ఆ చిన్నారి విద్యార్థులకు మాస్ కాపింగ్ (నకల్ కొట్టడం) అంటే ఏమిటో తెలియదంటే అతిశయోక్తి కాదు. బుడిబుడి అడుగులతో (తల్లిదండ్రులతో) పరీక్షా కేంద్రానికి చేరుకున్న 617 మంది చిన్నారి విద్యార్థులకు పరీక్షా కేంద్రం వద్ద మోహరించిన పోలీసులను చూసి భయానికి లోనయిన చిన్నారులకు, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందచేసిన పరీక్ష ప్రశ్నాపత్రం చూసి నివ్వెరపోవడం వారి వంతయిందని చెప్పవచ్చు. 4వ తరగతి ఉత్తీర్ణులైన చిన్నారి విద్యార్థులకు ‘లేపంగా అను పదము ఏ క్రీడకు సంబంధించింది, అతిపెద్ద ఖండము ఏది, మన దేశానికి హిమాలయాలు ఏ దిక్కున ఉన్నాయి, లాల్‌బహద్దూర్ స్టేడియం ఏ పట్టణంలో ఉంది, ఇండియన్ కరెన్సీని ఏమంటారు, రక్తములో గల ఎరువు రంగుకు కారణమైన వర్ణకము ఏది’ లాంటి 100 ప్రశ్నలు ఇస్తే ఆ చిన్నారులు వాటికి ఏమేరకు సమాధానాలు రాస్తారో ఆ ప్రశ్నా పత్రం తయారు చేసిన అధికారులకే తెలియాలంటూ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. అభం శుభం తెలియని వయసులో ఉన్న చిన్నారులకు నిర్వహించే పరీక్షా కేంద్రాల వద్ద ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, పిజి వార్షిక పరీక్షలకు, ఎంసెట్, ఐసెట్ లాంటి ఎంట్రెన్స్ పరీక్షలకు ఏర్పాటు చేసినట్లు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తే తమ చిన్నారులు భయంగుప్పిట్లోకి వెళతారన్న నిజాన్ని అధికారులు గమనించకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రశాంతంగా ముగిసిన ఎంట్రెన్స్ పరీక్షలు
పట్టణ శివారులోని రంజోల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్సియల్ వసతి గృహంలో 5వ తరగతిలో ప్రవేశానికై నిర్వహించిన పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద తనను కలిసిన మన తెలంగాణ విలేఖరితో లక్ష్మి కొంత సేపు ముచ్చటించారు. పరీక్షలు రాసేందుకు 667 మంది చిన్నారులు దరఖాస్తులు చేసుకున్నారని, అయితే 50 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఈ పోలీసుల బలగమేమిటని అడిగిని ప్రశ్నకు బదులిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Comments

comments