Home తాజా వార్తలు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student Commits Suicide In Rajanna Sircilla

సిరిసిల్ల ః రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చంద్రంపేట ప్రాంత డిగ్రీ విద్యార్థి కోలకాని భార్గవ్ (21) సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవ్ సోమవారం పరీక్ష రాసి ఇంటికి వచ్చి పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. మరోవైపు భార్గవ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కూడా కారణమని అంటున్నారు. మృతునికి తల్లీ, తండ్రి, ముగ్గురు సోదరులు ఉన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

Degree Student Commits Suicide In Rajanna Sircilla