Home హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

బాగ్ అంబర్‌పేటలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

Degree student in Bagh amberpet disappear
అంబర్‌పేట: కిరాణ దుకాణానికి వెళ్లిన ఓ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాగ్ అంబర్‌పేట డిడికాలనీలో నివాసముండే గ్యార శ్రీనివాస్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె గ్యార శిరీష(19) హిందీ మహావిద్యాలయంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిరాణ దుకాణానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది.తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, బందువుల ఇళ్లలో వాకబు చేసిన ఫలితం కనిపించలేదు. దీంతో గురువారం అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్, రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముండే కొమ్ము కిరణ్ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె వెళ్లిన తరువాత ఇంట్లో చూస్తే ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారం, రూ.4వేలు కనిపించలేదని పోలీసులకు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.