Search
Wednesday 21 November 2018
  • :
  • :

వైవి సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలింపు

YV-Subba-Reddy1

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వైసిపి ఎంపిల ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఎపి భవన్‌లో వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఎంపి వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీక్ష చేయడం సరికాదని వైద్యులు సూచించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్‌ రావుల ఆరోగ్యం క్షీణించడంతో శనివారం సాయంత్రం రామ్ మనోహర్ లోహియా  ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్‌ నిరవధిక వాయిదా అనంతరం రాజీనామాలు చేసిన వైసిపి ఎంపిలు, ఎపి భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం విదితమే.

Comments

comments