Home జగిత్యాల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం మండిపడ్డ రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం మండిపడ్డ రైతులు

Delayed farmers in delayed grain purchasesధరూర్‌లో రోడ్డెక్కి ఆందోళన

మనతెలంగాణ/జగిత్యాల: ఆరుగాలం శ్ర మించిపండించిన ధాన్యాన్ని అమ్ముకు నేందు కు కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు గా స్తున్నామని, వారం రోజులుగా గన్నీ సంచు లు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల మండలం ధరూర్‌లో రైతులు రోడ్డెక్కారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయగా రైతులు తమ పంట పొలాల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా నికి తరలించారు. తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకున్న రైతులు గన్నీ సంచులు లేక పడిగాపులు పడుతున్నారు. రేపు వస్తాయి… మాపు వస్తాయంటూ పేర్కొనండంతో గత వారం రోజులుగా ఎదిరి చూసిన రైతన్నలు ఓపిక నశించి రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత వారం రోజులుగా గన్నీ సంచులు లేవని, తమ గురించి పట్టించు కునే నాథుడే లేకుండా పోయాడని వాపో యా రు. కమ్ముకొస్తున్న మబ్బులతో తీవ్ర ఆం దోళనకు గురవుతున్నామని, ఇప్పటికైనా గన్నీ సంచులు తెప్పించి తమ ధాన్యాన్ని తూ కం వేయాలని కోరారు.