Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఢిల్లీ ఎయిర్‌పోర్టు దేశంలోనే నెం.1

Delhi world's busiest airports

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టు ఎక్కువ మంది ప్రయాణించిన విమానాశ్రయంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి 2016లో ఏకంగా 5.5 కోట్ల మంది ప్రయాణించారట. వీరిలో 4 కోట్ల మంది దేశీయంగా ప్రయాణించగా, 1.5 కోట్ల మంది విదేశాలకు వెళ్లారు. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టు తర్వాతి స్థానం ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్కింది. ఈ విమానాశ్రయం నుంచి 4.4 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

Comments

comments