Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అబూ సలేంకు ఏడేళ్ల జైలు

Delhi court sentences gangster Abu Salem to seven years in jail

ఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఢిల్లీ టిస్ హజరీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్రు చెప్పింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఐదు కోట్లు ఇవ్వాలని అబూ సలేం బెదిరించాడు. ఈ కేసులో అబూ సలేం దోషిగా తేలాడు. డిమాండ్ చేసిన డబ్బును ఇవ్వకపోతే చంపేస్తామని వ్యాపారవేత్తను అబూ సలేం బెదిరించాడు. ఈ క్రమంలో పలు కేసులు అబూ సలేంపై నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అబూసలేం అనుచరులు పవన్ కుమార్ మిట్టల్ అలియాస్ రాజా భాయ్, మహ్మద్ అస్రఫ్ అలియాస్ బబ్లూ, మాజిద్ ఖాన్ అలియాస్ రాజు భాయ్, చంఛల్ మెహతాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో అబూ సలేంను దోషిగా ప్రకటిస్తూ కోర్టు మే 30న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Delhi court sentences gangster Abu Salem to seven years in jail

Comments

comments