Home ఛాంపియన్స్ ట్రోఫీ రిషబ్, శాంసన్ వీరవిహారం

రిషబ్, శాంసన్ వీరవిహారం

  • గుజరాత్‌పై ఢిల్లీ భారీ విజయం

Samson-And-Pant

న్యూఢిల్లీ: ఐపిఎల్ పదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరో భారీ విజయాన్ని అందుకుంది. గురువారం ఇక్కడి ఫిరో జ్‌షా కోట్లా మైదానంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధిం చింది. రిషబ్ పంత్ 43 బంతుల్లో 9సిక్సర్లు, ఆరు ఫోర్ల తో 97 పరుగులు, ఓపెనర్ సంజూ శాంసన్ 31 బంతు ల్లో ఏడు సిక్సర్లతో 61 పరుగులు వీర విహారం చేయడ ంతో తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 17.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రిషబ్ పంత్, శాంసన్ చెలరేగడంతో ఢిల్లీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
చెలరేగిన రైనా, కార్తీక్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్‌కు ప్రారరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (9), మెక్‌కలమ్ (1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో గుజరాత్ పది పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత కెప్టెన్ సురేశ్ రైనా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తమపై వేసుకన్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడ్డారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించారు. వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకు డుగా ఆడిన రైనా 43 బంతుల్లోనే 4సిక్సర్లు, మరో ఐదు బౌండరీలతో 77 పరుగులు చేశాడు. మరోవైపు చెలరేగి ఆడిన కార్తీక్ ఐదు సిక్స్‌లు, మరో ఐదు ఫోర్లతో 34 బంతుల్లోనే 65 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇద్దరు మూడో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. అరొన్ ఫించ్ (27), జడేజా 18(నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో గుజరాత్ స్కోరు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులకు చేరింది.
స్కోరుబోర్డు:
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ రనౌట్ 9, మెక్‌కలమ్ (సి) పంత్ (బి) రబడా 1, సురేశ్ రైనా రనౌట్ 77, దినేష్ కార్తీక్ (సి) అండర్సన్ (బి) కమ్మిన్స్ 65, అరొన్ ఫించ్ (సి) పంత్ (బి) రబడా 27, ఇసాన్ కిషన్ (సి) అయ్యర్ (బి) కమ్మిన్స్ 4, రవీంద్ర జడేజా నాటౌట్ 18, ఫాల్కనర్ (సి) బ్రాత్‌వెట్ (బి) అండర్సన్ 1, సంగ్వాన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 208 పరుగులు
బౌలింగ్: నదీమ్ 2-0-28-0, రబడా 4-0-28-2, కమ్మిన్స్ 4-0-30-2, మహ్మద్ షమి 3-0-40-0, అమిత్ మిశ్రా 2-0-23-0, శామ్యూల్స్ 2-0-22-0, అండర్సన్ 3-0-36-1.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ శాంసన్ (సి) ఫాల్కనర్ (బి) జడేజా 61, కరుణ్ నాయర్ (సి) కార్తీక్ (బి) సంగ్వాన్ 12, రిషబ్ పంత్ (సి) కార్తీక్ (బి) థంపి 97, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 14, అండర్సన్ నాటౌట్ 18, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 17.3 ఓవర్లలో మూడు వికెట్లకు 214 పరుగులు.
బౌలింగ్: సంగ్వాన్ 4-0-43-1, బాసిల్ థంపి 4-0-40-1, ఫాల్కనర్ 2.3-0-35-0, రైనా 2-0-24-0, అంకిత్ సోని 2-0-26-0, జడేజా 2-0-28-1, స్మిత్ 1-0-11-0