Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ముంబై ధాటికి… ఢిల్లీ ఢమాల్

DD-MI

న్యూఢిల్లీ : వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జోరుకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. శనివారం ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 146 పరుగుల భారీ తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టు ముంబై కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బరిలోకి దిగిన ఢిల్లీ 13.4 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కరణ్ శర్మ, హర్భజన్ సింగ్ మూడేసి వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
టపా..టపా
భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ప్రారంభం నుంచే కష్టాల్లో చిక్కు కుంది. భీకర ఫాంలో ఉన్న ఓపెనర్ సంజు శాంసన్ తొలి బంతికే పెవిలి యన్ చేరాడు. మెక్లెనఘాన్‌కు ఈ వికెట్ దక్కింది. తర్వాత వచ్చిన శ్రేయ ర్ అయ్యర్ (౩), రిషబ్ పంత్(౦)లు కూడా వెంటవెంటనే ఔటయ్యారు. తర్వాత ఢిల్లీ ఏ దశలోనూ మళ్లీ కోలుకోలేక పోయింది. కిందటి మ్యాచ్ లో గుజరాత్ లయన్స్‌ను హడలెత్తించిన రిషబ్ పంత్ ఈసారి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ ఆశలు నీరుగారాయి. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఢిల్లీని తేరు కోనివ్వలేదు. జట్టు లో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. కరుణ్ నాయర్(21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సిమ్మన్స్ జోరు..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబైకు ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, పార్థివ్ పటేల్ శుభారంభం అందించారు. లెండిల్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అభిమానులను కనువిందు చేశాడు. కుదురుగా ఆడిన పార్థివ్ మూడు ఫోర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. చెలరేగి ఆడిన సిమ్మన్స్ 43 బంతుల్లోనే 4సిక్సర్లు, 5ఫోర్లతో 66 పరుగులు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్ 35 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 63 పరుగులు చేసి అజే యంగా నిలిచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 3సిక్స్‌లు, ఫోర్‌తో 14 బంతు ల్లో అజేయంగా 29 పరుగులు సాధించాడు. దీంతో ముంబై స్కోరు 212 పరుగులకు చేరింది.
సంక్షిప్త స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 212/3(లెండిల్ సిమ్మన్స్ 66, పొలార్డ్ 63(నాటౌట్), పాండ్యా 29(నాటౌట్)
ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ 13.4 ఓవర్లలో 66 ఆలౌట్ (కరుణ్ నాయర్ 21, అండర్సన్ 10, హర్భజన్ ౩/23, కరణ్ శర్మ 11/3, మలింగ 5/2).

Comments

comments