Home ఛాంపియన్స్ ట్రోఫీ ఢిల్లీ గెలిచిందోచ్…

ఢిల్లీ గెలిచిందోచ్…

Delhi-Daredevils

న్యూఢిల్లీ: వరుస ఓటములతో బేజారెత్తిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఓ విజయం దక్కింది. మంగళ వారం ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి జయకేతనం ఎగుర వేసింది. కొరె అండర్సన్ 24 బంతుల్లోనే మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 41 పరుగులు చేసి ఢిల్లీకి ఘన విజయం అందించాడు. మరోవైపు మోరిస్ ఏడు బంతుల్లో15 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. కెప్టెన్ కరుణ్ నాయర్ 20 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో ౩9 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ (24), శ్రేయస్ అయ్యర్(33) కూడా కీలక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.

కుదురుగా..
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు మరోసారి శుభారంభం అందించారు. ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే వీలు దొరికితే భారీ షాట్లు కొట్టారు. వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోల్‌కతాపై సెంచరీతో కదంతొక్కిన వార్నర్ ఈసారి భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఢిల్లీ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో వార్నర్ దూకుడుగా ఆడలేక పోయాడు. 21 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్స్‌తో ౩౦ పరుగులు చేసిన వార్నర్‌ను మహ్మద్‌షమి పెవిలి యన్ పంపించాడు. చక్కని బంతితో షమి రైజర్స్ సారథిని క్లీన్‌బౌల్ట్ చేశాడు. అయితే వార్నర్ అప్పటికే ధావన్‌తో కలిసి 5.2 ఓవర్లలోనే 53 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన విలియమ్‌సన్ కూడా వేగంగా ఆడలేక పోయాడు. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు కుదురుగా బౌలింగ్ చేస్తూ విలియమ్‌సన్‌ను కట్టడి చేశారు. మరోవైపు ధాటిగా ఆడిన ధావన్ 17 బంతుల్లోనే 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

చెలరేగిన యువీ..
ఈ దశలో స్కోరును పెంచే బాధ్యతను డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తనపై వేసు కున్నాడు. హెన్రికెజ్స్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడూకుంటూనే అడపాదడపా బౌండరీలు కొడుతూ ముందుకు సాగాడు. యువీ తన మార్క్ షాట్లతో చెలరేగడంతో ప్రత్యర్థి బౌలర్లు గతి తప్పారు. యువీని నిలువరించేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు హెన్రికెజ్ కూడా దూకుడుగా ఆడడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ ౩5 బంతుల్లోనే 50 పరుగులు జోడిం చారు. చివరి ఓవర్లలో యువీ మరింత విజృంభించాడు. వరుస ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను హ డలెత్తించాడు. ఇదే క్రమంలో 34 బంతుల్లోనే 7ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీని పూర్తి చే సుకున్నాడు. అంతేగాక జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. హెన్రికెజ.వ 18 బం తుల్లో రెండు బౌండరీలతో 25 పరుగులు చేశాడు. ఇక, దూకుడుగా ఆడిన యువరాజ్ 40 బంతుల్లో 11 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది.

స్కోర్ బోర్డ్స్: 

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ శాంసన్ (సి) ధావన్ (బి) సిరాజ్ 24, కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) కౌల్ 39, రిషబ్‌పంత్ (బి) సిరాజ్ ౩4, శ్రేయస్ అయ్యర్ (సి) సిరాజ్ (బి) భువనేశ్వర్ ౩౩, అండర్సన్ నాటౌట్ 14, క్రిస్ మోరిస్ నాటౌట్ 15, మొత్తం19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-౦-33-1, మహ్మద్ సిరాజ్ 4-0-41-2, సిద్దార్థ్ కౌల్ 4-౦-38-1, హెన్రికెజ్ 2.1-0-36-0, రషిద్ ఖాన్ 4-0-24-0, యువరాజ్ 1-0-16-0
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బి) మహ్మద్ షమి ౩౦, శిఖర్ ధావన్ (సి) అయ్యర్ (బి) అమిత్ మిశ్రా 28, విలియమ్‌సన్ (సి) మోరిస్ (బి) మహ్మద్ షమి 24, యువరాజ్ సింగ్ నాటౌట్ 70, హెన్రికెజ్ నాటౌట్ 25, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం 2౦ ఓవర్లలో ౩ వికెట్లకు 185 పరుగులు
బౌలింగ్: జయంత్ యాదవ్ 4-0-26-0, రబడా 4-0-59-0, క్రిస్ మోరిస్ 4-0-36-0, మహ్మద్ షమి 4-0-36-2, అమిత్ మిశ్రా 4-0-23-3.