Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సూపర్ శామ్.. అండర్సన్ అదుర్స్..

పరుగుల తేడాతో పంజాబ్‌పై ఢిల్లీ విజయం
ఎలెవన్‌ను చిత్తు చేసిన జహీర్‌సేన

Kolkatta

ఢిల్లీ: ఐపిఎల్ 10వ సీజన్‌లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై ఢిల్లీ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఢిల్లీకి రెండు పాయింట్లు లభించగా, గెలిచిన మొత్తం మ్యాచ్‌లతో కలిపి 4 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ 3వ స్థానంలో నిలిచింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అండర్సన్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఐపిఎల్ 10వ సీజన్‌లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లుగా దిగిన సంజు శ్యామ్సన్, కరుణ్ నాయర్ బరిలోకి దిగారు. శ్యామ్సన్ (19) పరుగులకే చేతులేత్తేయగా, కరుణ్ నాయర్ (0) పరుగులేమీ తీయకుండానే నిష్క్రమించాడు.

అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ (22) పరుగులతో మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ ఆటగాడు బిల్లింగ్స్ (55) పరుగులతో అర్థ శతకాన్ని నమోదు చేసి అక్సర్ పటేల్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం రిషబ్ పంత్ (15), మోరిస్ (16) పరుగులు చేయగా, కమిన్స్ (12), అండర్సన్ (39) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో ఆరోన్ రెండు వికెట్లు, కేసి కరియప్ప, మోహిత్ శర్మ, అక్సర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టాయినిస్, ఇషాంత్ శర్మకు బదులుగా ఇయాన్ మోర్గాన్, కెసి కరియప్పను ఎంపిక చేశాడు.

పంజాబ్ కుదేలు..

189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పేలవ ప్రదర్శనతో ఆదిలోనే తడబడి మూడు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ వోహ్రా (3), ఆమ్లా (19), సాహా (7) పరుగులతో నిష్క్రమించగా, మోర్గాన్ (22), కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (0) పరుగులేమీ చేయకుండానే మిశ్రా బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మిల్లర్ (24) పరుగులతో ఎల్‌డిడబ్లుగా ఔట్ కాగా, మోహిత్ శర్మ (13), కరియప్ప (1) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. మిగత ఆటగాళ్లలో అక్సర్ పటేల్ (44), సందీప్ శర్మ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి పంజాబ్ 137 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఢిల్లీ బౌలర్లలో నదీమ్, కమిన్స్ రెండు వికెట్లు, మోరిస్‌కు మూడు వికెట్లు, మిశ్రా, అండర్సన్‌కు తలో వికెట్ లభించింది.

స్కోరు వివరాలు..

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజు శ్యామ్సన్ (సి) మోర్గాన్ (బి) కరియప్ప ; 19, బిల్లింగ్స్ (సి) మిల్లర్ (బి) పటేల్ ; 55, కరుణ్ నాయర్ (సి) సాహా (బి) ఆరోన్ ; 0, శ్రేయాస్ అయ్యర్ (సి) మోర్గాన్ (బి) మోహిత్ శర్మ ; 22, రిషబ్ పంత్ (సి) మోర్గాన్ (బి) ఆరోన్; 15, అండర్సన్ నాటౌట్ ; 39, మోరిస్ (సి) శర్మ (బి) సందీప్ శర్మ ; 16, కమిన్స్ నాటౌట్ ; 12 ఎక్స్‌ట్రాలు : 10. మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లు) 188 పరుగులు. వికెట్ల పతనం: 1-53, 2-55, 3-96, 4-103, 5-120, 6-151.

పంజాబ్ బౌలర్లు : సందీప్ శర్మ : 4-0-41-1, మోహిత్ శర్మ : 4-0-37-1, అక్సర్ పటేల్ : 4-0-33-1, ఆరోన్ : 4-0-45-2, కెసి కరియప్ప : 3-0-23-1, గ్లెన్ మ్యాక్స్‌వెల్ : 1-0-7-0.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: 137/9 (20 ఓవర్లలో) ఎల్‌బిడబ్లు (బి) నదీమ్; 3, హాసీమ్ ఆమ్లా (సి) బిల్లింగ్స్ (బి) మోరిస్ ; 19, వృద్థిమాన్ సాహా (సి) జహీర్ ఖాన్ (బి) నదీమ్ ; 7, మోర్గాన్ (సి) నయిర్ (బి) కమిన్స్ ; 22, డేవిడ్ మిల్లర్ ఎల్‌డిడబ్లు (బి) అండర్సన్ ; 24, మ్యాక్స్‌వెల్ (సి) బిల్లింగ్స్ (బి) మిశ్రా ; 0, అక్సర్ పటేల్ నాటౌట్ ; 44, మోహిత్ శర్మ (బి) కమిన్స్ ; 13, కరియప్ప (బి) మోరిస్ ; 1, సందీప్ శర్మ నాటౌట్ ; 2. ఎక్స్‌ట్రాలు: 2. మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లు) 137 పరుగులు. వికెట్ల పతనం: 1-5, 2-21, 3-31, 4-64, 5-65, 6-88, 7-133, 8-134, 9-137.

ఢిల్లీ బౌలర్లు : జహీర్ ఖాన్ : 4-0-38-0, నదీమ్ : 2-0-13-2, మోరీస్ : 4-0-23-2, కమిన్స్ : 4-0-23-2, అమిత్ మిశ్రా : 3-0-16-1, అండర్సన్ : 3-0-23-1.

Comments

comments