Search
Friday 21 September 2018
  • :
  • :

ప్రదర్శనకు కలాం వస్తువులు.

abdul-kalam-image-done-in-pరామేశ్వరం : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యక్తిగత వస్తువులను ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించారు. బుధవారమిక్కడ వాటిని స్వీకరించిన ఢిల్లీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శిస్తామని తెలిపారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రసిద్ధ సాంస్కృతిక, వాణిజ్య ప్రాంతమైన ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కలాం పూర్వీకుల ఇంటికి వెళ్లిన మంత్రి కపిల్ మిశ్రా నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందాన్ని ఆయన కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వనించారు. ఉన్నతాధికారుల బృందాన్ని ఆయన కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వనించారు. అనంతరం లాంఛనప్రాయ విజ్ఞప్తి మేరకు కలాం వ్యక్తిగత వస్తువులను ఆయన పెద్ద సోదరుడు ఎపిజె మహ్మద్ ముత్తు మీరన్ మరైకయార్ వారికి అప్పగించారు. ఆ వస్తువుల్లో కలాం ప్రసంగాల డివిడిలు, వస్త్రాలు, పత్రాలు, జ్ఞాపికలు, ఆయన పరిశోధన పుస్తకాలు, సాహిత్యపుస్తకాలు, కళ్లజోడు, వీణ తదితరాలున్నాయి.

Comments

comments