Home జాతీయ వార్తలు ఆస్థానా పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ఆస్థానా పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

Rakesh Asthanaసిబిఐ ప్రత్యేక డైరెక్టర్ అరెస్టుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ: సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అరెస్టు అనివార్యంగా కనిపిస్తోంది. ఆస్థానాపైన, సస్పెన్షన్‌కు గురైన సిబిఐ డిఎస్‌పి దేవేందర్ కుమార్‌పైన నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ వీరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వేగంగా దర్యాప్తు జరగాల్సిన అవసరమున్నదని పేర్కొంది. ఈ పరిణామంతో ఆస్థానాను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

Delhi High Court rejects plea of Rakesh Asthana, CBI Special Director Asthana could be arrested following the development.