Home జాతీయ వార్తలు కేంద్ర హోంమంత్రితో ఢిల్లీ ఎల్‌జి భేటీ…

కేంద్ర హోంమంత్రితో ఢిల్లీ ఎల్‌జి భేటీ…

Rajnath

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సమావేశం అయ్యారు. తన ఇద్దరు సహచర మంత్రులతో కలిసి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఐఎఎస్ అధికారుల సమ్మె కారణం చేత ఢిల్లీలో ఎటువంటి పనులు జరగడం లేదని సిఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ సమ్మె వల్ల  గత 3 నెలలుగా వాయు కాలుష్యంపై ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదివారం నాడు ప్రధాని మోడీ కార్యాలయం వరకు ర్యాలీ తీయనున్నట్టు కేజ్రీ స్పషం చేశారు. వీటితో పాటు తాజా పరిణామాలను వివరించేందుకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్,  రాజ్‌నాథ్ నివాసానికి చేరుకున్నారు.