Home సిద్దిపేట కాళేశ్వరం అద్భుతం…

కాళేశ్వరం అద్భుతం…

 Delhi media delegation team visit Kaleshwaram project

చిన్నకోడూరు: మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులో నిర్మిస్తున్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను శనివారం డిల్లీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించారు. రిజర్వాయర్ పనులు, టన్నెల్ నిర్మాణాలను, పల్లగుట్టపై నిర్మిస్తున్న గెస్ట్‌హాజ్ కట్ట పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రగతి అద్బుతంగా ఉందని మీడియా బృందం కితాబిచ్చారు. ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టు రాష్ట్ర రూపురేఖలు మారుతాయన్నారు. అంతకు ముందు ప్రాజెక్టు ఈఈ ఆనంద్ , కాళేశ్వరం ప్రాజెక్టు ,రంగనాయకసాగర్ రిజర్వాయ్‌ల నిర్మాణాలను న్యూస్ ద్వారా మీడియా బృందానికి వివరించారు.