Home జాతీయ వార్తలు తండ్రి మృతిని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య

తండ్రి మృతిని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య

constable commits suicideన్యూఢిల్లీ: తండ్రి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుుంది. ఢిల్లీకి చెందిన సురేష్ అనే పోలీసు కానిస్టేబుల్ దయాళ్ పూర్ పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సురేష్ తండ్రి చనిపోయాడు. తండ్రి మరణంతో కుమారుడైన పోలీసు కానిస్టేబుల్ మనస్థాపంతో కుమిలి పోయాడు. తండ్రి మృతిని తట్టుకోలేక పోలీసు కంట్రోల్ రూంలో తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేష్ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Delhi Police constable dies after shooting himself