Home జాతీయ వార్తలు వేటాడి వెంటాడి… నడిరోడ్డుపై ఎస్‌ఐ హత్య

వేటాడి వెంటాడి… నడిరోడ్డుపై ఎస్‌ఐ హత్య

Sub Inspector

 

ఢిల్లీ: ఓ ఎస్‌ఐని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని షాదరా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజ్ కుమార్ అనే ఎన్‌ఐ(56) ఢిల్లీలోని కమ్యూనికేషన్ విభాగంలో పని చేస్తున్నాడు. గత రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన అనంతరం భోజనం చేసి వాకింగ్ వెళ్లాడు. గ్యాంగ్ స్టర్స్ ప్లాన్ ప్రకారం… ఎస్‌ఐతో దుండగులు గొడవకు దిగారు. దీంతో దుండగుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎస్‌ఐను దుండగులు తీవ్రంగా కొట్టుతుండడంతో పోలీసు ఠాణాలోకి పారిపోయాడు. నిందితులు రెచ్చిపోయి ఎస్‌ఐని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ దుర్మరణం చెందాడని స్థానిక ఎస్‌పి మేఘనా యాదవ్ పేర్కొన్నారు. నిందితులపై 30 కేసులు ఉన్నాయని, మద్యం డ్రగ్స్ అమ్మకాలపై తన తండ్రి ఉక్కుపాదం మోపడంతో హత్య చేశారని రాజ్‌కుమార్ కూతురు వైశాలి మీడియాకు తెలిపింది. మద్యం, డ్రగ్స్ అమ్మకాలకు వ్యతిరేకించినందుకు తన తండ్రిని చంపేస్తామని దుండగులు ఎన్నో సార్లు బెదరించారని ఆమె ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిసి కెమెరాలో నిందితుల చిత్రాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. 

 

Delhi Police Sub Inspector Murder by Gangsters