Home జాతీయ వార్తలు వెన్నులో వణుకు పుట్టించే కారు యాక్సిడెంట్!(వీడియో)

వెన్నులో వణుకు పుట్టించే కారు యాక్సిడెంట్!(వీడియో)

Fatal Car Crashన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీ రాత్రి జరిగిన ఓ కారు యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముగ్గురు మిత్రులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా సిటీ ట్రిప్ వేశారు. రద్దీగా ఉన్న రోడ్డుపై కారును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పొనిచ్చారు. అయితే, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను తప్పించే క్రమంలో కారు వేగాన్ని అదుపుచేయలేక పక్కన ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో కారు రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కారులో ప్రయాణించిన ముగ్గురు స్నేహితులను హిమాన్షు, జయంత్, సాహెబ్ పోలీసులు గుర్తించారు. హిమాన్షు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు యువకులు మద్యం సేవించి ఉండటంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.