Search
Monday 24 September 2018
  • :
  • :

ఇంకొటి గెలిస్తే..

delhi vs hyderabad ipl match

న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే 8 మ్యాచుల్లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ పోటీలో గెలిస్తే ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకున్న హైదరాబాద్ జోరుమీదుంది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ జోరును అడ్డుకోవడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అంత సులువుకాదు. బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా అసాధారణ బౌ లింగ్‌తో హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తోంది. హైదరాబాద్‌తో పోల్చితే ఢిల్లీ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పృథ్వీ షా, మాక్స్‌వెల్, రిష బ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తదితరులతో ఢిల్లీ బ్యా టింగ్ బలోపేతంగా కనిపిస్తోంది. అయితే ఉప్పల్ వేదికగా జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఢిల్లీను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఈసారి కూడా అదే జో రును కొనసాగించాలనే పట్టుదలతో సన్‌రైజర్స్ ఉంది. ఇక, ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు చేజార్చుకున్న ఢిల్లీ ఈ సీజన్‌లో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇక, నాకౌట్ రే సుకు చేరుకోవాలంటే ఇకపై జరిగే అన్ని మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలవక తప్పదు. అంతేగాక, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడక తప్ప దు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఎలా ఆడుతుందో బరిలోకి దిగితేగానీ తెలియదు.
బ్యాటింగే సమస్య..
ఈ సీజన్‌లో వరుస విజయాలు సాధిస్తున్నా హైదరాబాద్‌ను బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతూనే ఉం ది. శిఖర్ ధావన్, అలెక్స్ హెల్స్, మనీష్ పాండే, సాకిబ్, యూసుఫ్ పఠాన్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే జట్టు భారాన్ని మోపుతున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతున్న విలియమ్సన్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపైనే ఆశలు పెట్టుకుంది. ఇక, ధావన్ వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. ఇది జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ధావన్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే బ్యాటింగ్ కష్టాల నుంచి బయట
పడడం సన్‌రైజర్స్‌కు అంత సులువుకాదు. ఇక, మనీష్ పాండే అడపాదడపా బ్యాట్‌ను ఝులిపిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అతని బ్యాటింగ్ నత్తను తలపిస్తోంది. దీంతో జట్టు వేగంగా పరుగులు సాధించలేక పోతోంది. మనీష్ మెరుపులు మెరిపిస్తే భారీ స్కోరు సాధించడం హైదరాబాద్‌కు కష్టం కాదు. అయితే అతను మాత్రం తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది జట్టుపై ప్రభావం చూపుతోంది. పఠాన్ కూడా గతంలో లాగా దూకుడుగా ఆడలేక పోతున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప అతను రాణించింది లేదనే చెప్పాలి. సాకిబ్ బం తితో రాణిస్తున్నా బ్యా ట్‌తో ప్రభావం చూపలేక పోతున్నాడు. కిందటి మ్యాచ్‌లో కాస్త రాణించడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. ఫాంలో ఉన్న కెప్టెన్ విలియమ్సన్‌పైనే జట్టు ఆశలు పెట్టుకుంది. అత ను రాణిస్తే జట్టు గౌరవప్రద స్కోరు సాధించడం ఖాయం.

Comments

comments