Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కూతుళ్ల పెళ్లి కోసం తల్లి…!

Delhi woman became thief to marry the Daughters
న్యూఢిల్లీ: పెళ్లికాని కూతుళ్ల కోసం ఓ తల్లి దొంగగా మారిన వైనమిది. కూతుళ్ల వివాహం జరిపించాలనే తాపత్రయంతో దొంగతనాలు చేసి ఓ తల్లి కటకటాల పాలైంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజస్థాన్, అజ్మీర్ కు చెందిన మోతియా(35)కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిని తీసుకుని ఢిల్లీకి వలస వచ్చిన మోతియా ఉద్యోగం కోసం చాలా చోట్ల తిరిగింది. కానీ, ఎవరూ ఆమె ఉద్యోగం కల్పించలేదు. దాంతో రోజువారి పూట గడవడమే వారికి గగనంగా మారింది. అలాంటి సమయంలో పెళ్లిడుకి వచ్చిన ముగ్గరు కుమార్తెల వివాహాలు చేసేందుకు ఆమె అడ్డదారుల్లో వెళ్లింది. ఎలాగైన తన కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనే ఆలోచనతో దానికి కావాల్సిన డబ్బుల కోసం దొంగగా మారింది. ధనవంతుల ఇండ్లను ఎంచుకుని, ఎవరూ లేని సమయంలో ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడేది. ఇలా దాదాపు 24 దొంగతనాలు చేసిందామె. అయితే, ఇటీవల తన ఇంట్లో రూ. 50 వేలు పోయాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీ లను పరిశీలించగా దొంగతనం చేసిన మోతియాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Comments

comments