Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

50 వేల కోట్ల డివిడెండ్

Delight to the government after the demitization

కేంద్రానికి ఇవ్వాలని నిర్ణయించిన ఆర్‌బిఐ
గత ఏడాది రూ.30,659కోట్లు మాత్రమే
డీమానిటైజేషన్ తర్వాత ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ : డీమానిటైజేషన్(నోట్ల రద్దు) నిర్ణయం తర్వాత ప్రభుత్వానికి ఇది ఊరటనిచ్చే విషయం. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో నిర్ణయించిన మేరకు ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల డివిడెండ్(మిగులు నిధులు) ఇవ్వాలని ఆర్‌బిఐ నిర్ణయించిం ది. 2018 జూన్ 30 ముగింపు నాటికి గాను ఈ డివిడెండ్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డు సమావేశంలో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం ఆర్‌బిఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు సమావేశమై, రూ.500 బిలియనన్లు అంటే రూ.50 వేల కోట్లు మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారని రిజర్వు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. జులైజూన్ ఆర్థిక సంవత్సరంగా ఆర్‌బిఐ అనుసరిస్తోంది. గత ఏడాది జూన్ 30 ముగిం పు నాటికి ఆర్‌బిఐ ప్రభుత్వానికి రూ.30,659 కోట్ల డివి డెండ్‌ను ఇచ్చింది. అయితే అంతకుముందు 2016 సంవత్స రంలో ఇచ్చిన డివిడెండ్ (రూ.65,876 కోట్లు)తో పోలిస్తే ఇది తక్కువగానే ఉంది.

ఈ ఏడాది మార్చి ప్రారంభంలో సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక డివిడెండ్‌గా రూ.10 వేల కోట్లు(2017 18కి గాను) అందజేసిం ది. 2017 జూన్‌లో మిగులు నిధులు తక్కువగా ఉన్నాయి. దీని కి ప్రధాన కారణం 2016 నవంబర్ 9న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొత్త కరెన్సీ నోట్ల ముద్రణకు ఆర్‌బిఐ భారీ ఖర్చు అయింది. దీంతో ఆర్‌బిఐ కేంద్రానికి డివిడెండ్ ఆశించినంతగా చెల్లించలేకపోయింది. ఆర్‌బిఐ చట్టం (1934) ప్రకారం, అనుమానాస్పంద రుణాలు, మొండి బకాయిలు, ఆస్తుల తరుగుదల, సిబ్బందికి చెల్లింపులు వంటి వాటికి కేటాయింపులు చేసిన తర్వాత మిగులు నిధులను ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. అదే సమయంలో బ్యాంకు లకు ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) లేదా మొండి బకాయిల సమస్యలు ఆర్‌బిఐ తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించే క్రమంలో ఆర్‌బిఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Comments

comments