Home కామారెడ్డి పైకం కోసం ప్రసవం ఆలస్యం

పైకం కోసం ప్రసవం ఆలస్యం

జూన్ 2 కోసం ఎదురు చూపులు
నెలలు నిండిన కాన్పులకు నో
ప్రభుత్వ చేయూత కోసం ఆశలు
ఆసుపత్రుల్లో పెరిగిన గర్భిణుల సంఖ్య

                   pregnant-women

బాన్సువాడ: బాలింతల ఆరోగ్యంతో పాటు పుట్టిన శిశువుల బాగుకు కాం క్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 వ తారీఖు నుండి ప్రారంభించే కెసిఆర్ కిట్ కోసం గర్భిణిలు ఆశతో ఉన్నారు. అందు కోసం ప్రసవాన్ని సైతం నిలుపుదల చేసు కుంటున్నారు. నెలలు నిండినా డెలవరీకి నో అంటున్నారు. రెండు రోజుల ముందు ఎందు కు రెండవ తారీఖున చేసుకుంటామని చెబుతు న్నారు. ప్రసవం కాకుండా ఆపాలని వైద్యులను కోరుతున్నారు. వచ్చే 12 వేల రూపాయలు మా కు…మా బిడ్డ ఖర్చుకు సరిపోతాయని పేర్కొంటు న్నారు. దీంతో వారం రోజులుగా ప్రభుత్వ ఆసు పత్రులలో డెలవరీ కోసం వచ్చిన గర్భిణీల సంఖ్య పెరిగింది. మరికొంత మంది గ్రామాల్లోనే ఉన్నారు.

ప్రసవ సమయం దగ్గర పడ్డ నొప్పులు రాకుండా మాత్రలు ఇవ్వాలని స్థానిక వైద్య సిబ్బందిని వేడు కుంటున్నారు. పైకం కోసం పండంటి బిడ్డకు జన్మ నిచ్చే మాహా బాగ్యాన్ని సైతం దూరం చేసుకుంటు న్నారు. కామారెడ్డి జిల్లాలో బాలింతలకు కెసిఆర్ కిట్ ప్రచారం ఊపందుకుంది. జూన్ 2 వ తారీఖు నుండి అమలులోకి వస్తుందన్న ప్రచారం సాగ డంతో అంతకు ముందు డెలివరీ అయితే తమకు డబ్బులు రావన్న అపోహలకు లోనవుతున్నారు. అందుకోసం ప్రసవాన్నే ఆలస్యం చేసుకుం టున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ప్రభుత్వం కెసిఆర్ కిట్‌తో పా టు మూడు విడుతలుగా అందించే 12 వేల రూపాయల కోసం ఎంతో ఆశతో ఎదురు చూ స్తున్నారు. వైద్యులు కూడా గర్భిణీలు చెప్పిందే తడు వుగా ప్రసవాలు చేయకుండా మిన్ను కుంటున్నారు. నెలలు నిండిన తరువాత నిమిషం కూడా ప్రసవాన్ని ఆపే అవకాశాలు లేక పోయినప్పటికీ కెసిఆర్ ఆందించే ఆర్థిక సహాయం కోసం అందుకు కూడా సాహసిస్తున్నారు.

ఇది వరకు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలను నెల లు నిండక పోయినా వారం రోజుల ముందే సీజరి యేన్ చేసి బిడ్డను బయటకు తీసేందుకు వైద్యులు సన్నద్దమయ్యేవారు. పిండం అడ్డం తిరిగిందనో… పాప కడుపులో చక్కగా తిరగడం లేదనో…ఇతర కారణాలను చూపుతూ డెలవరీలు చేసేవారు. దాంతో ఆసుపత్రికి పురిటి నొప్పులతో వచ్చిన మహిళలు రెండు రోజుల్లో పండంటి బిడ్డతో కనిపించే వారు. కాని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కెసిఆర్ ఇచ్చిన భరోసాతో గర్భిణులు ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు.

కాన్పు అయ్యాక పని చేయకుండా హాయిగా ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకునే అవకాశం ఏర్పడి ందని మురిసిపోతున్నారు. తన బిడ్డను కూడా చక్కగా చూసుకోవచ్చన్న బావనతో ఉన్నారు. అంతే గాకుండా కెసిఆర్ కిట్‌ను కూడా అందిం చడంతో పాపకు మరే ఇతర ఖర్చులు ఉండవని ఇంట్లో ఆర్థిక సమస్యలు రావన్న ధీమాలో కనిపిస్తున్నారు.

అందులోనూ మగ బిడ్డ పుడితే 12 వేల రూపాయ లు, ఆడ బిడ్డ పుడితే మరో వెయ్యి రూపాయలను పెంచి 13 వేల రూపాయలను అందిస్తామని చె ప్పడంతో గ్రామీణ ప్రాంత గర్భిణులు ఎక్కువగా ప్రాధాన్యతను చూపుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల్లోని మహిళలకు ఈ పథకం వరంగా మారినప్పటికీ వారికి ఎంతవరకు దరి చేరుతుందనేది సందిగ్ధంగా మారింది. జూన్ 2 నుండి గర్బిణీలకు అందించే ఆర్ధిక సహాయంతో పాటు కిట్‌లను కూడా వైద్య శాఖ అధికారులు సిద్దం చేస్తున్నారు. అందుకు కావాల్సిన ఏర్పా ట్లను గత పక్షం రోజుల నుండే పర్యవే క్షిస్తున్నారు. ఏది ఏమైనా ప్రసవాలకు వచ్చే మహిళలకు మాత్రం అన్ని విధాల లాభం చేకూరనుంది.