Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జాప్యం లేకుండా రైతుబంధు

Delvary uninterrupted farmer checks as quickly as possible

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/వనపర్తి : పంపిణీకి సిద్ధంగా ఉండి ఎలాంటి ఆటంకం లేని రైతుబంధు పథకం చెక్కులన్నింటిని సాధ్యమైనంత వరకు త్వరగా పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రైతుబంధు పథకంపై అధికారులతో సమీక్షించారు. మండలాల వారిగా మంత్రి చెక్కుల పంపిణీపై సమీక్ష సందర్భంగా కొన్ని గ్రామాల్లో రైతులు చెక్కు లు తీసుకోలేదని తెలుపగా వ్యవసాయ విస్తర ణాధికారులు సంబంధిత గ్రామాలకు వెళ్లి స్థానిక విఆర్‌ఒలు, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధుల సహకారంతో సంబంధిత రైతుల బంధువులు,ఇతరులతో వారి సమాచారం తీసుకొని చెక్కులు పంపిణీ చేయాలని  ఆదేశించారు. వచ్చేవారంలోగా వీటన్నింటిని పంపిణీ చేయాలని, తదుపరి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకు రైతుబంధు పథకం కింద జిల్లాకు వచ్చిన చెక్కులు, పాస్‌పుస్తకాలను పంపిణీచేసిన చెక్కులు, పాస్‌బుక్‌లు, పంపిణీ కాకుండా ఉన్న చెక్కులు, పాస్ బుక్‌లకు సంబంధించిన కారణాలు తదితర అంశాలపై సమీక్షించారు. అంతకు ముందు కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద జిల్లాకు 1,54,186 చెక్కులు, రూ.141.48 కోట్లు రాగా ఇప్పటివరకు 1,171625 చెక్కులను పంపిణీ చేసి రూ. 119.44 కోట్ల లను పంపిణీ చేయడం జరిగింద న్నారు. 1,04,652 చెక్కులు, పాస్‌బుక్‌లతో సహా పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. డబుల్ ఖాతాలు సుమారు 5వేలు ఉన్నాయని, 1700 మేర చనిపోయిన కేసులున్నాయని ,విస్తీర్ణంలోల తేడాలున్న కేసులు 4వేలు ఉన్నట్లు కలెక్టర్ మంత్రి కృష్ణారావుకు వివరించారు. సమీక్షా సమావేశంలో జెసి.పి. చంద్ర య్య, ట్రైనీ ఐఎఎస్.సంతోష్, జిల్లా వ్యవసాయాధికారిణి సుజాత, ఆర్డీఒ చంద్రారెడ్డి, పాన్‌గల్ ఎంపిపి వెంకటేశ్వర్లు , జడ్పిటిసి రవి, మార్కెట్ కమిటి చైర్మన్ రాంచంద్రారెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు హాజరయ్యారు.

Comments

comments