Home జాతీయ వార్తలు కలాం పార్టీని నిషేధించాలంటూ లేఖ

కలాం పార్టీని నిషేధించాలంటూ లేఖ

breaking newsచెన్నై : భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరిట ప్రారంభించిన పార్టీపై నిషేధం విధించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చెన్నిమలైకు చెందిన సామాజిక సేవకుడు చొక్కలింగం లేఖ రాశారు. కలాం పేరున ‘అబ్దుల్ కలాం లక్ష్యం ఇందియ కట్చి’ అనే ఓ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అబ్దుల్ కలాం ఓ గొప్ప మానవతవాది మాత్రమేనని రాజకీయవేత్త కాదని ఆయన అన్నారు. అందుచేత ఆయన పేరుతో పార్టీ ప్రారంభించడం అనవసరమని, దీనిపై పూర్తి విచారణ జరిపి ఆ ఫార్టీని నిషేధించాలని కోరారు. కలాం పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.