Home వరంగల్ రూరల్ కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది

కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది

Democracy won in Karnataka

మనతెలంగాణ/రఘునాథపల్లి : కర్ణాటక బలపరీక్షలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యురప్ప ఓడిపో ఠయిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ సి సెల్ జి ల్లా అధ్యక్షులు కడారి నాగేశ్వర్‌రావు, మ ండల అధ్యక్షులు మంద రమేష్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి యడ్యురప్పను గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చే యడానికి యడ్యురప్పను ఆహ్వానించి ప్రజాస్వామ్య విలువలను మంట గలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జెడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని బలపరీక్షలో బిజెపి ఓటమే ప్రధానమంత్రి నరేంద్రమోడి పతనానికి ప్రథమ మెట్టు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కావటి భాస్కర్, ఇమ్మడిశెట్టి హరికృష్ణ, వెంకటరెడ్డి, ఇబ్రహిం పాష, కడారి చిన్న నాగేష్, బత్తిని మల్లేష్, శాగ శ్రీనివాస్, కోళ్ల రవిగౌడ్, నోకుంట్ల కాంత్రికుమార్, ఐలయ్య, ఈర్యనాయక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో… కర్ణాటక రాష్ట్రంలో నూతనం గా ఏర్పడిన బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష లో నెగ్గక పోవడంతో కాంగ్రెస్ -జెడిఎస్ కూటమి వి జయం సాధించడంతో మండల కేంద్రంలోని కాం గ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్లను పం చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎ ంపిపి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ లే కున్నా గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించాలని చూడగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో బిజెపి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాం గ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జున్నుతుల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, సూర రంజిత్, దొంతి సుమన్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లబెల్లిలో….. కర్ణాటక రాష్ట్రంలో బిజెపిపై కాం గ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు రాబోయే ఎన్నిక ల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కర్ణాటకలో విజయం సాధించిన సందర్భంగా పార్టీ శ్రేణులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రాజు, యూత్ ప్రధాన కార్యదర్శి కుసుంభ రఘుపతి నాయకులు పెంతల కొమురరెడ్డి, చిట్యాల ఉపేందర్‌రెడ్డి, ఎరుకల రవీందర్, సుధాకర్, వీరన్నలు పాల్గొన్నారు.
దుగ్గొండిలో….. కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ ంపై కాంగ్రెస్ -జెడిఎస్ కూటమి విజయం సాధించ డం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలోని గిర్నిబావిలో స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శంకేష్ కమలాకర్, లంక మురళి, మట్టరాజు, కూస రాజు, యూత్ అధ్యక్షుడు కొల్లూరి రాజు, రాజిరెడ్డి, సాంబయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
పరకాల టౌన్‌లో… కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణకు ఒప్పుకొని అసమర్థుడిగా రెండు రోజల సిఎం రాజీనామా చేసి సుప్రీకోర్టు ఆదేశాలతో కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని ఇది కేవలం ప్రజల విజయమని పరకాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పసుల రమేష్ అన్నారు. శనివారం కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపన సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బిజెపికి తగినంత సీట్లు లేకపోవడంతో ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో ముందస్తు చర్యలో భగంగా సిఎం యడ్యూరప్ప రాజీనామ చేశారు. దీంతో కాంగ్రెస్ జెడిఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. అందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్ కూడలి వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పసుల రమేష్ మాట్లాడుతూ దొడ్డి దారిన బిజెపి అధికారం చేపట్టాలని ప్రయత్నంలో పూర్తిగా విఫలమైందని ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు. కర్ణాటక సిఎం రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని రాష్ట్రానికి విధానం అన్నట్లు బిజెపి వ్యవహరిస్తుంది అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బిజెపి నేతల తీరు సరైంది కాదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జెడిఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నలుబోల కృష్ణయ్య, కొయ్యడ శ్రీనివాస్, మర్త రఘుపతి గౌడ్, రఘుపతిరెడ్డి, దాసరి భిక్షపతి, మార్క అభినవ్ గౌడ్, గోవింద సురేష్ తదితరులు పాల్గొన్నారు.