Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) చీర్యాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

చీర్యాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Demolition of illegal structures in custody

మన తెలంగాణ/కీసర: చీర్యాల్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలను సోమవారం పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ఈఓపీఆర్‌డీ యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ అధికారుల బృందం చీర్యాల్ సర్వే నంబరు 197లో హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా చేపట్టిన పలు ఇళ్ల నిర్మాణాలను జేసీబి సాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్‌డీ మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు, లే-అవుట్‌లు చేపడితే ఉపేక్షించేది లేదన్నారు. తిరిగి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి ఓ.శాంతి తదితరులు పాల్గొన్నారు.