Home తాజా వార్తలు డిమానిటైజేషన్: నగదు విత్‌డ్రా పరిమితి పెంచే యోచనలో కేంద్రం

డిమానిటైజేషన్: నగదు విత్‌డ్రా పరిమితి పెంచే యోచనలో కేంద్రం

New-Rs.-2000-Notes

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా కేంద్రం బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రాపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిజర్వు బ్యాంక్ అధికారిక సమాచారం ప్రకారం త్వరలోనే నగదు విత్ డ్రా పరిమితులు సడిలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో నగదు విత్ డ్రాలను సమీక్షించనున్న ఆర్‌బిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

సేవింగ్ ఖాతా పరిమితిని వారానికి రూ. 24 వేల నుంచి రూ. 35 వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆర్‌బిఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే కరెంట్ ఖాతా పరిమితిని వారానికి రూ. 50 వేల నుంచి కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎటిఎం కేంద్రాల్లో తొలుత విధించిన పరిమితి రూ. 2,500 నుంచి రూ. 4,500 సమీక్షించిన విషయం విదితమే.