Search
Monday 24 September 2018
  • :
  • :

పాఠ్యాంశంగా పెద్దనోట్ల రద్దు అంశం

RBSEజైపూర్: దేశంలోని నల్లధనం, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశం ఇప్పుడు రాజస్థాన్ స్కూళ్లలో పాఠ్యాంశంగా బోధించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ అంశం కింద విద్యార్థులకు డిజిటల్ లావాదేవీలు, మొబైల్ వ్యాలెట్ స్ట్రక్చర్‌పై పాఠ్యాంశాలు ఉండనున్నాయి. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆర్‌బిఎస్‌ఇ) ఈ మేరకు నిర్ణయించింది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ అంశం ఒక పాఠ్యాంశంగా ఉండబోతోందని సమాచారం. ఆర్‌బిఎస్‌ఇ ఛైర్మన్ బిఎవ చౌదరి ఈ విషయాన్ని ధృవీకరించారు.

Comments

comments