Home జాతీయ వార్తలు బాలివుడ్ నటులకు డెంగ్యూ అలర్ట్ నోటీసులు

బాలివుడ్ నటులకు డెంగ్యూ అలర్ట్ నోటీసులు

dengueముంబయి : బాలీవుడ్ నటులకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ డెంగ్యూ అలర్ట్ నోటీసులు జారీ చేసింది. డెంగ్యూ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నోటీసుల్లో సూచించింది. అనిల్‌కపూర్, జితేంద్ర, జూహ్లీ చావ్లాకు అలర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటుపరిసరాల పరిశుభ్రత పాటించి, డెంగ్యూ నివారణకు సహకరించాలని కార్పొరేషన్ అధికారులు సూచించారు.