Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

యన్మన్‌గండ్ల గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు….

Dengue case registered in the village of Yanmangadla

నవాబ్‌పేట్‌: మండల పరిధిలోని యన్మన్‌గండ్ల గ్రామంలో అతి ప్రమాదకర ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి కేసు నమోదయ్యింది. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన విద్యార్థిని, స్థానిక ఎంపిటిసి శేఖరయ్య కుమార్తె ప్రియాంక ఆదివారం విపరీత జ్వరంతో మెలికలు తిరగి ఆరోగ్యం విషమించడంతో జిల్లా కేంద్రంలోని మల్లిక ఆసుపత్రికి తరలించడంతో రక్త పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది సదరు బాలికకు డెంగ్యూ జ్వరం వుందని తేల్చడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ వ్యాధి వుందని మరోసారి తెల్చేసి విద్యార్థిని శరీరంలో రక్త ఫలికలు పూర్తిగా పడిపోవడంతో చికిత్సను ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడిందని కుటుంబ సభ్యులు పేర్కోంటున్నారు. ఆసక్తికర విషయమేమిటంటే సదరు బాలికకు ప్రాణాంతక డెంగ్యూ జ్వరం సోకిందని గ్రామంలో అందరికీ తెలిసిపోగా… అదే గ్రామానికి చెందిన ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది, ఆశా కార్యకర్తలకు 48 గంటలు దాటినా తెలియకపోవడం, వారి ద్వారా ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులకు, వారి నుండి జిల్లా అధికారులకు సైతం తెలియకపోవడం విశేషం. అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ కేసు నమోదైన ప్రాంతాల్లో వైద్యశాఖా సిబ్బంది హుటాహుటిన పర్యటించి చర్యలు తీసుకుంటున్న తరుణంలో స్థానిక వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం గమనార్హం.
ఫోటోరైటప్04ఎన్‌డబ్లుపిటి01ఃడెంగ్యూ జ్వరంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ప్రియాంక.ఇన్‌సెట్‌లో ఫైల్‌ఫొటో…
ఫోటోరైటప్04ఎన్‌డబ్లుపిటి02ఃవిద్యార్థిని ప్రియాంక ఫైల్‌ఫొటో.

Comments

comments