న్యూఢిల్లీ : తమిళనాడు సిఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అడ్వొకేట్ జీఎస్ మణి చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై లేవనెత్తారు. దీనిపై ధర్మాసనంలోని సహచర న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్‌లతో చర్చించిన ఖేహార్, అత్యవసర విచారణకు స్వీకరించేందుకు నిరాకరించారు.