Home జనగామ ఎర్రబంగారానికి బూడిద

ఎర్రబంగారానికి బూడిద

మందులు పిచకారి చేసిన ఫలితం శూన్యం
అందోళన చెందుతున్న రైతులు

Mirchi

రఘునాథపల్లి: ఎర్రబంగారంగా పిలువబడే మిర్చి పంటలకు బూడిత తేగలతో పాటు వింత తెగులు సోకడంతో రైతన్నలు తీవ్ర అందోళన చెందుతున్నారు.తొలకరి జల్లులు కుర్వగానే రైతులు మిర్చి నారు పోసి 45 రోజుల్లో మిర్చి పంట మొక్కలను నాటుతారు.నాటినప్పటి నుంచి నాలుగు నెలలు వరుకు తోటను వేపుగా పెంచేందుకు యూరియా, డీఏపీలతో పాటు పంటలను పరశీలీస్తూ మందులు సహితం పిచికారి చేయాల్సి ఉంటుంది.అప్పటి వరుకు నాలుగు నుంచి ఐదు నెలలు గడవగంతో మొదటి కాపు కాస్తుంది,అప్పటికి జనవరి నెల రావడంతో చలి తీవ్రత ఎక్కువుగా ఉండడంతో చలిని తట్టుకోలేక బూడిద తెగులుతో పాటు వింత తెగులు సోకి చెట్టు కింద ఉన్న ఆకుల కింద భాగంలో తెల్లని మచ్చలాంటివి వచ్చి కాసిన కాయలు నల్లలభడంతో పాటు ఆకులు ముఉత పట్టి చెట్టు పనికి రాకుండా పోయేదశకు చేరు కుంటుంది.

రాత్రి అనక పగలనక కష్టపడి పంటను కంటికి రెప్పలా కాపాడు కుంటు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో మిర్చి పంటకు శ్రీకారం చుట్టిన రైతన్నలకు ప్రస్తుతం పంట చేతికందే సమయంలో పంటకు బూడిద తేగలుతో పాటు వింత తెగులు సోకడంతో చెట్లు ఎండి పోవడం, చెట్టు మొఖం మాడ్చడంతో మిర్చి రైతులు దిక్కుతోచని పరి స్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నారు.ఓ పక్క పంట వేపుగా పెరింగ దని సంబరపడుతుంటే మరో వైపు బూడిద తేగులుతో పాటు వివిద తెగులు సోకడంతో దిగుబడి వచ్చే అవకాశాలులే కపోడంతో ఈ ఏడాది మిర్చి కంట్లో కారం కొట్టినట్లుయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క ఎకరానికి రూ.30వేల నుండి 40వేలలు పెట్టుబడి పెట్టిన రైతులకు తెగుళ్లు సోకడంతో నష్టం వాటిల్లే పరిస్థితి కన్ఫిస్తుంది.

గతంలో వాతావరణం అనూకూలించడంతో అధిక దిగుబడి రావడంతో పాటు గిట్టుబాటుధర రూ11వేల నుండి13వేల వరుకు ఉండడంతో ఈ సంవత్సరం చాలా మంది రైతులు మిర్చి పంటను సాగు చేశారు. పంటలకు తెగుళ్లు సోకడం వల్ల దిగుబడి తగ్గడం తో పాటు మిర్చి దర కేవలం రూ.7వేల నుండి11 వేల ఉడడంతో రైతులు తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉంది. మండలంలో కంచనపల్లి, రామన్నగూడెం, కోమల్ల, నిడి గొండ పరిదిలోని గుంటూర్‌గూడెం,ఇబ్రాహీంపూర్, గోవర్ధనగీరి, ఫత్తే షాపూ ర్ పాటు పలు గ్రామాల్లో 150 ఎకరాల్లో రైతులు తేజ మిర్చి (కారం ఎక్కువు గా ఉండే మిర్చి)తో పాటు వండర్, అగ్నిరేక, దేశి,341 రకాలు సాగు చేశారు.చలి తీవ్రతకు తట్టు కోలేక మర్చి పంటలకు తెగుళ్లు వచ్చి రైతన్నలు ఇబ్బం దులు పడుతున్నప్పటికి వ్యవ సాయ అదికారులు రైతులకు అవగహ న కల్పించ డం లేదని విమర్శలు ఉన్నాయి.పంట కాల పరిమితి సుమారు మార్చి వరకు ఉండే అవకా శం ఉంటుందని ,ఇప్పటి కైనఅదికారులు స్పందించి రైతులకు అవగహన కల్పిస్తే పెట్టిన పెట్టు బడైనవస్తుందనిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.

పెట్టుబడివచ్చేపరిస్థితి లేదు..(కట్కురిహరీష్ రైతు)
మిర్చి పంటకు బూడిద తెగుళ్లు రావడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.ఇప్పటి వరుకు ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి పెట్టాను.ఎకరానికి కనీసం ఐదు ఆరు క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశంలేదు.

రైతులకుపరిహారం అందించాలి..చీమలపాటి రవి
తెగుళ్లతో మిర్చి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోని నష్ట పరిహారం అందించాలని లేకుంటే రైతులు నష్ట పోయి అప్ఫుల్లో కూరకపోవడం ఖాయంని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
హలావత్ మొంగ్యా