Home రాష్ట్ర వార్తలు హైదరాబాద్‌లో డెంటల్ వైద్యురాలు ఆత్మహత్య

హైదరాబాద్‌లో డెంటల్ వైద్యురాలు ఆత్మహత్య

SUICIDE

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: అనుమానాస్పద స్థితిలో వైద్యురా లు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పో లీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక పక్క అనారోగ్యం.. మరోపక్క తనకు సమాజం సహకరించడం లేదని, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఇదిలా ఉంటే ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించినందుకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరి ఆరోపించింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గీతా కృష్ణ (25) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ డెం టల్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 2 గం టల ప్రాంతంలో గీతా కృష్ణ హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. భోజన సమయంలో తోటి మిత్రులు ఈ విష యం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాని కి చేరుకుని పరిశీలించి, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి సోదరి మాత్రం ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతోనే గీతాకృష్ణ ఆత్మహ త్యకు పాల్పడిందని,  మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చు రీకి తరలించారు. అయితే సూసైడ్ నోట్ ఎవరు రాశారనే దానిపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఎల్‌బి నగర్ ఎసిపి పృథ్వీధర్‌రావు తెలిపారు.