Home ఎడిటోరియల్ తూనికలు, కొలతలపై మేల్కోవాలి

తూనికలు, కొలతలపై మేల్కోవాలి

TS Government

 

తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులు నిత్యం పలు రకాల వ్యాపారుల చేతుల్లో మోసాలకు గురవుతున్నారు. క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులు తమ లాభార్జనే ధ్యేయంగా తమ సరుకులను అమ్ముకుంటున్న సంగతి సర్వజనాలకు తెలిసిందే. అయి తే ఇందులో జరిగే తూనికల, కొలతల తతంగం ఒకటి. ముఖ్యంగా చేపలు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యా పారులు ఎక్కువ మంది తక్కువ తూకం రాళ్లతో ఈ దందా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చేప ల వ్యాపారులే ఈ దందా చేయడంలో నిష్ణాతులు. వినియోగదారుల కళ్ళెదుటే జరుగుతున్నా మోపపోవటం వినియోగదారుల వంతే అవుతున్నది.

ఈ అక్రమ తూకాల నియంత్రణ కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన తూనికలు, కొలతల శాఖ ఒకటి. ఈ శాఖాధికారులు తమ విధుల్లో భాగంగా సక్రమంగా ఆకస్మిక దాడులు ప్రతి వారానికో, నెలకో ఈ దాడులు నిర్వహిస్తే ఈ మోసాల దందాలకు తెరపడేది. కాని ఈ శాఖాధికారుల్లో అధిక శాతం సిబ్బంది వ్యాపారుల నుండి నెలవారీ మామూ ళ్ళు వసూలు జేస్కొని పడకేసే యంత్రంగా మారుతున్నది. ఈ శాఖలో కొత్తగా చేరిన లేదా నిజాయితీపరులైన అధికార్లే గుడ్డిలో మెల్లగా తమ విధులకు న్యాయం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సిద్దిపేట జిల్లా కేంద్రం లో సంబంధిత శాఖాధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పలు అక్రమాలు వెల్లడయ్యాయి. ఈ దందా ప్రతిచోటా జరుగుతుందనటానికి ఇది చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు. తూనికల కొలతల శాఖాధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో బయల్పడిన అక్రమాలను మీడియా ముందు వెల్లడి చేశారు.

చేపల వ్యాపారుల తూకం రాళ్ళు కిలోగ్రాంకు అరకిలోగ్రాం సరి సమానంగా తూకం ఉండటం అధికార్లను ఆశ్చర్య పరిచింది. ఒక కిలోగ్రాం చేపలు కొంటే అర కిలోగ్రాం చేపలే వస్తాయన్న మాట. ఇట్లా ప్రతిరోజు వినియోగదారులు రకరకాలు మోసపోతూ మౌనం వహిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులు తమ తమ పరిధిల్లోని మార్కెట్ కేంద్రాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తే వినియోగదారులకు న్యాయం జరుగుతుందని చాలా మంది ప్రజల అభిప్రాయంగా వెల్లడి చేస్తున్నారు.

వినియోగదారులు కూడా చైతన్య శీలురు అయితే కొంతలో కొంతైనా ఈ దందాకు తెర పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎటిఎంలను ఏర్పాటు చేసిన విధంగానే ప్రభుత్వ తూనికల కొలతల శాఖ కూడా ఈ రద్దీ ప్రాంతాల్లో ఎలెక్ట్రానిక్ తూకం స్టాండులను ఏర్పాటు చేసినట్లయితే ఈ దందా నియంత్రించినట్లవుతుంది. వ్యాపారులకు ఎలెక్ట్రానిక్ తూకం స్టాండులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించాలి. పాతకాలపు త్రాసులు, స్టాండింగ్ త్రాసులు, బండరాళ్ళను తూకం రాళ్ళుగా వినియోగించరాదని హెచ్చరికలు చేయాలి. హెచ్చరిక లు పెడచెవిన పెట్టిన వ్యాపారులకు జరిమానా, జైలు శిక్ష లాంటి శిక్షలు విధిస్తామనే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమున్నది. వినియోగదారులకు న్యాయం చేసిన వారవుతారు. వినియోగదారులు కూడా చైతన్యవంతంగా మారి తాము వెచ్చించిన డబ్బుల మొత్తానికి సరిపడా వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. తాము అప్రమత్తంగా ఉన్నా కూడా వ్యాపారులు మోసాలకు పాల్పడినప్పుడు వెంటనే సంబంధిత తూనికల, కొలతల అధికారులకు తెలియజేయాలి.

మార్కెట్ స్థలాల్లో ఆయా ఏరియా అధికార్ల ఫోన్ నెంబర్లు వెల్లడి చేసే ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పలు మెలుకువలు పాటించినప్పుడు అమ్మకందారులు కూ డా తమ అక్రమ పనుల నిలుపుదల జరుగుతుంది. వినియోగదారులకు చెప్పలేనంత మేలు కలుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ తూనికల, కొలతల శాఖాధికారుల బృందాలు ప్రతి నిత్యం మేల్కొని పైన సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని వినియోగదారులు ఆశిస్తున్నారు.

                                                                                                                        – నల్లెల రాజయ్య
Department of Weights and Measures in State