Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అంబేద్కర్ లేకుంటే నేను లేను : కడియం

Deputy Chief Minister kadiyam srihari attends andhra bank general body meeting

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే సాధ్యమైందని, అంబేద్కర్ ఆశయాల మేరకే ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి కొనియాడారు. అంబేద్కర్ లేకుంటే తాను లేనని మంత్రి చెప్పారు. ఆర్ టిసి కళ్యాణ మండపంలో ఆంధ్రా బ్యాంక్ ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఆల్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్‌ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ… ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి ఫలితం దక్కింది అంబేద్కర్ వల్లనేనని చెప్పారు. అందరికీ విద్యనందించాలనే అంబేద్కర్ గొప్ప ఆశయంతోనే రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

దళితులు ఎదిగిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యాచార నిరోధ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ముందస్తు బెయిల్ అవసరం లేదన్న సుప్రీం కోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టిన విషయం విదితమే. పిఒఎ చట్టాన్ని కాపాడటం కోసం అనేక మంది దళితులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వం తక్షణమే పిఒఎ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని కడియం స్పష్టం చేశారు. పిఒఎ చట్టాన్ని బలోపేతం చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తోందన్నారు. జాతీయ ఎస్.సి, ఎస్.టి కమిషన్ పిఒఎ చట్టం కాపాడడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పేదలకు ప్రయోజనం చేకూరాలని బ్యాంకులను జాతీయం చేశారు. కానీ బ్యాంకుల జాతీయ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లక్షల కోట్లు బ్యాంకులకు టోకర పేట్టారు. పేదవానికి 10వేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. బ్యాంకుల వైఖరి వల్లే పేదవారి కోసం పెట్టిన ప్రభుత్వ ఆర్థిక సహకార పథకాలు వాళ్లకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.సి, ఎస్.టి వెల్ఫేర్ అసోసియేషన్ బ్యాంకు సేవలను పేదవారికి చెరువా చేయాలని కడియం పేర్కొన్నారు.

Comments

comments