Home కామారెడ్డి అభివృద్ధి చెందాలి

అభివృద్ధి చెందాలి

Iftar-Dinner

మనతెలంగాణ/కామారెడ్డి: గంగా జమున తెహజీబ్ లాగా హిందూ, ముస్లింలు అందరూ కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ లౌకికవాది అని ముస్లింలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ఆశయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో బారత్ గార్డెన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. గత ంలో ఏ ప్రభుత్వం మైనార్టీల కోసం ఇన్ని పథకాలను అమలు చేయలేదని అన్నారు. మైనార్టీల కోసం దేశం మొత్తంలో భారత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. మైనార్టీ విద్యార్థుల మెరుగైన విద్య కోసం గత మూడు ఏళ్లలో 206 మైనార్టీ గురుకులాలను స్థాపించామన్నారు. బంగారు తెలంగాణ కోసం హిందూ ముస్లింలందరు కలిసి అభివృద్ధ్ది చెందాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముస్లీం సోదరులకు రంజాన్ పండుగకు ఉచిత దుస్తుల పంపిణీ ఏ రాష్ట్రం చేస్తలేదని చెప్పారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసి పేద ముస్లీంల సంక్షేమానికి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
భూ ప్రక్షాళనలో నిజాం కాలంనాటి రికార్డులను సరిచేశామని రైతులను ఆదుకున్నామని డిప్యూటి సిఎం చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ సర్కారు రైతు పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధుతో పెట్టుబడి సహాయం, ఆగస్టు 15 నుంచి రైతులకు ఉచిత బీమా పథకం టిఆర్‌ఎస్ సర్కారు ప్రత్యేక పథకాలను గుర్తు చేశారు. డిప్యూటి సిఎం ఇఫ్తార్‌విందులో పాల్గొన్నవారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఇతర అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.